రాష్ట్ర సంపదను తన వ్యక్తిగత సంపదగా మార్చుకుంటున్నజగన్‌రెడ్డి,అవినీతిని కేంద్రీకరించి 10 వేలకోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఇసుక పేరుతో జగన్ రెడ్డి వేలకోట్ల దోపిడీకీ ఏవిధంగా తెగబడుతున్నాడో, తనజేబు కంపెనీ అయిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కంపెనీకి రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను ఏవిధంగా కట్టబెట్టాడో అందరూ చూస్తూనే ఉన్నారన్నారు. ప్రజల తరపును టీడీపీ పక్షాన కొన్ని ప్రశ్నలతో ప్రభుత్వానికి కరపత్రాన్ని విడుదల చేస్తున్నామని, కరపత్రంలో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
- జయప్రకాష్ పవర్ వెంచర్స్ ముసుగులో ఎ1 జగన్‌రెడ్డి, అతని సహ నిందితుడు ఎ4 ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ‘పంచాయతీల’ మంత్రి పెద్దిరెడ్డి కలసి హోల్‌సేల్‌గా రూ.10వేల కోట్ల దోపిడీకి తెరతీయడం వాస్తవం కాదా? రాంకీ గ్రూపులో నేటికీ డైరెక్టర్‌గా ఉన్న గంగాధర శాస్త్రి జెపి గ్రూపులో గతంలో డైరెక్టర్‌గా ఉండి నేడు క్విడ్ ప్రోకో వ్యవహారాన్ని నడిపిన మాట వాస్తవం కాదా?
- 2019-20 ఆర్థిక సంవత్సరానికి జెపి వెంచర్స్ రూ.3,500 కోట్లు నష్టాన్ని ప్రకటించి దివాళాకు సిద్ధంగా ఉన్న విషయం వాస్తవం కాదా? నష్టాల ఊబిలో ఉన్న ఒక సంస్థకు ఇసుక సంపద కట్టబెట్టడం మీ లోపాయికారీ ఒప్పందం కాదా?
- చంద్రబాబు నాయుడు పాలనలో ఉచిత ఇసుక విధానం ద్వారా ట్రాక్టర్ ఇసుక 1200 రూపాయలకు వినియోగదారుడి ఇంటికి చేరితే…ఇప్పుడు నాలుగు రెట్లు పెంచి రూ.5 వేలకు చేర్చిన మీ ఇసుక పాలసీ ప్రజలకు ఏ విధంగా మేలైంది? ఇది ప్రజాద్రోహం కాదా?
- మీ దోపిడీకి రూపొందించిన ఇసుక పాలసీలతో 125 రకాల నిర్మాణ రంగాలపై ఆధారపడిన 50లక్షల మంది కార్మికులు రోడ్డున పడటం నిజం కాదా? పనులు దొరక్క 60మంది ఆత్మహత్యలు చేసుకోవడం వాస్తవం కాదా?
- చంద్రబాబునాయుడు హయాంలో పంచాయితీలు, స్థానిక సంస్థలు, డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుకను విక్రయిస్తే విమర్శించిన మీరు ఇప్పుడు మీ జేబు సంస్థకు అప్పగించడం హోల్ సేల్ దోపిడీకి తెరతీయడం కాదా?
- మీరు చెప్పిన లెక్కల ప్రకారమే… రాష్ట్రంలో ప్రతిరోజూ 1.25లక్షల టన్నుల చొప్పున ఏడాదికి 4కోట్ల టన్నుల ఇసుక లభ్యత ఉండగా, 2కోట్ల టన్నులు అని ఎలా చెబుతారు? దీనిని బట్టి మీరు మిగిలిన 2కోట్ల టన్నుల ఇసుకను బ్లాక్ మార్కెటింగ్ ద్వారా మూడేళ్లలో 10వేల కోట్లరూపాయలకు పైగా హోల్‌సేల్ దోపిడీకి సిద్ధమైంది నిజం కాదా?
- టన్ను రూ.375 ఉన్న ఇసుకను రూ.475 లకు పెంచి దానికి అదనంగా టన్నుకు రూ.150 వరకు హ్యాడ్లింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్న మాట నిజం కాదా? దీనికి రవాణా ఛార్జీలు అదనం కాదా? ఇదంతా జె-ట్యాక్స్ కోసం సామాన్యుడిపై మీరు మోపుతున్న భారం కాదా?
- ఎంఎస్‌టిసి కేవలం ఒక సర్వీసు ప్రొవైడర్ మాత్రమే. ఇసుక టెండరు పారదర్శకంగా ఎంఎస్‌టిసి ద్వారా నిర్వహించామని చెబుతున్న మీరు, లోపభూయిష్టమైన టెండరు నిబంధనలు రూపొందించింది మీరు కాదా? మీ జేబు సంస్థకు కట్టబెట్టింది వాస్తవం కాదా?
- టెండరు దక్కించుకున్న జెపి పవర్ వెంచర్స్ సంస్థ ఇదివరకు ఎప్పడైనా ఇసుక తవ్వకాలు నిర్వహించిందా? 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకు కేవలం 9 లక్షల టన్నుల తవ్వకాల సామర్థ్యం సరిపోతుందని టెండరు నిబంధనను ఎవరికి మేలు చేయడం కోసం రూపొందించారు?
- రూ.100 కోట్లకు పైగా ఉన్న ప్రతి టెండర్‌ను జ్యుడీషియల్ రివ్యూకు పంపుతామని ప్రగల్భాలు పలికిన మీరు నేడు వేల కోట్ల ఇసుక టెండర్‌ను ఎందుకు జ్యుడీషియల్ రివ్యూకు పంపలేదు? ఈ మొత్తం వ్యవహారం తాడేపల్లి ప్యాలెస్‌కు డబ్బు తరలించడంలో భాగంగా కాదా?
- ప్రభుత్వరంగ సంస్థలైన ఏపీయండిసి, ఎన్‌యండిసిలను కాదని, ప్రజలకు మేలు చేసే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి జెపి పవర్ వెంచర్స్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం మీ దోపిడీ దాహం కాదా?
- సూట్‌కేసు కంపెనీలు సృష్టించి, మనీలాండరింగ్ చేసే మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి నేడు ఇసుక తవ్వకాలలో ఎటువంటి అనుభవం లేని ట్రైడంట్ కెంఫర్ మరియు కెయన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ వారితో డమ్మీ టెండర్ల నాటకమాడి మీ జేబు సంస్థ జెపికి కట్టబెట్టలేదా?
- విశాఖ ఉక్కు, పోర్టుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తుంటే మీరు ఇసుకను ప్రైవేట్‌పరం ఏ విధంగా చేస్తారు?
- రెండేళ్లు వైసీపీ నేతల రిటైల్ దోపిడీని నేడు అధినేతలే హోల్‌సేల్ దోపిడీగా మార్చిన మాట వాస్తవం కాదా?
- . నాడు మద్యం, సిమెంటు విషయంలో అవినీతిని కేంద్రీకృతం చేసి వేలకోట్ల దోపిడీకి తెగబడుతున్న మీరు నేడు ఇసుకను కూడా దోపిడీ కోసం కేంద్రీకృతం చేసింది నిజం కాదా?https://www.youtube.com/watch?v=LflTa–RGf
Must Read ;- విశాఖ ఉక్కుపై జగన్‌ది కుట్రే.. ఆధారాలతో వెల్లడించిన పట్టాభి