రాష్ట్రంలో బీజేపీ ఉందా? ఉంటే ఎక్కడా?
ఏపీలో బీజేపీ అనేది ఉందా? ఉంటే ఎక్కడుంది? ప్రభుత్వ వైఫల్యాలపై ఆ పార్టీ స్టాండేంటీ? అధికార వైఎస్సార్సీపీని పొగిడే భజన బృదంలో సోము, సునీల్ దేవదర్ సభ్యత్వం ఏమైనా తీసుకున్నారా? చంద్రబాబును ద్వేషిస్తూ .. రైతు ఉద్యమంలో పోషించాల్సిన పాత్రను ఎలా విస్మరిస్తారు? రాష్ట్రంలో మీ వల్లా ఏంటీ ఉపయోగం? పవర్ ను పక్కపెట్టుకుని వాడుకోవడం తెలియదా ..? భజన కొట్టికొట్టి బద్వేల్లో చేతులెత్తేశారా? తిరుపతిలో కమలం తిరగబడడానికి కారణమేంటి? రెండు చోట్ల డిపాజిట్లు కూడా రాకపోవడానికి అసలు రీజనేంటి ? ఇలా .. ప్రశ్నల వర్షాన్ని ఏపీ ప్రజలే కాదు, ఆ పార్టీ బాస్ కే బాస్ అమిత్ షా తిరుపతి వేదికగా ఏపీ బీజేపీ పై కురిపించారు. నిజమే బీజేపీలో అంతర్గతంగా మెదులుతున్న అనుమానాలను కూడా ఇవే. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనంతరం అమిత్ షా, రాష్ట్ర బీజేపీ కార్యవర్గంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షు సోము, పురంధేశ్వరి, సుజనా, సీఎం రమేష్ తదితరులు ముఖ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సోము, సునీల్ దేవదర్ పై అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అప్పుడలా తీర్మానం చేసి .. ఇప్పుడిలా తప్పుకుంటే ఎలా!
కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ అమరావతి రాజధానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ప్రకటించి తీర్మానించింది. మరి నేడు రైతులు చేస్తున్న ‘న్యాయంస్థానం టూ దేవస్థానం’మహాపాదయాత్రలో పార్టీ ఎందుకు పాల్గొనడం అమిత్ షా ప్రశ్నించారు. దీనికి సోముతో పాటు పార్టీ కేడర్ వద్ద ఎటువంటి సమాధానం లేదు. పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటే దానిపై పూర్తిగా నిలబడాలి. అంతేకానీ సెల్ఫ్ ఎజెండాలతో ముందుకుపోతే పార్టీ స్టాండ్ ప్రజలకు అర్థమయ్యేది ఎలా? అని తలంటినట్లు తెలుస్తోంది. బీజేపీ స్టాండ్ రాజధాని అమరావతి, పాదయాత్రలో తప్పకుండా బీజేపీ శ్రేణులు పాల్గొని మద్దతు ప్రకటించండి అని రాష్ట్ర నాయకత్వాన్ని అమిత్ షా అదేశించినట్లు తెలుస్తోంది. రావెల కిషోర్ బాబు మహాపాదయాత్రకు స్వయంగా వెళ్లి మద్దతు ప్రకటిస్తే … సునీల్ దేవదర్ ఆయనపై మండిపడినట్లు అమిషాకు ఫిర్యాదులందాయి. దీంతో ఈ విషయంలో అమిత్ షా చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
వ్యతిరేకత పెరుగుతుంటే నిద్రపోతున్నారా?
ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనాలోచిత చర్యలకు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలా సర్వత్రా వ్యక్తమౌతున్న వ్యతిరేకను ప్రశ్నించకుండా నిద్రపోతున్నారా? అంటూ బీజేపీ శ్రేణులపై అమిత్ షా ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ఆ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవడంలో పార్టీ విఫలమవుతోందని ఎరుక చేశారు. నాయకత్వంలో అభిప్రాయ బేధాలు ఇప్పటికావని, ప్రజా సమస్యలపై మీరు ముందుకు సాగుతూ .. కేడర్ ను కలుపుకుపోవాలని నాయకత్వానికి దిశ నిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే ఒకపక్క దేశంలోని అన్ని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలలో కర్నాటక పాగా వేయగా .. తెలంగాణలో పార్టీ అనుహ్యంగా పుంజుకుంటుంది. పొరుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటున్న తీరును చూస్తూ .. ఏపీలో పార్టీ పరిస్థితి ఎందుకింత అధ్వానంగా మారిందని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే చంద్రబాబు ను విమర్శించడంమాని, అధికారపక్షంపై విమర్శనాస్త్రాలు సంధించాలని సూచించారు. ఈ సమావేశంలోనే రాష్ట్రాధ్యక్షడు సోము, విష్ణువర్థన్ రెడ్డి పై పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీలో పలువరు సీనియర్ చర్చించుకుంటున్నారు. అమిత్ షా క్లియర్ గైడ్లెన్స్ తో ఏపీలో బీజేపీ శ్రేణులు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ ఏపీలో ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేఖ ఉద్యమాలకు అడుగులు వేయడం అనివార్యమైంది.
Must Read ;- ఏపీలో తిరుగుబాటు బావుట!










