‘ఏపీ రాజధాని అమరావతే హద్దు.. వేరేది వద్దు’ అని అమరావతి రైతులు అందుకున్న నినాదం 684 రోజులకు చేరింది. రాజధాని అమరావతిని కాపాడుకోవడాని, ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అడుతున్న ముడుక్కలాటాను ఛేదించేందుకు గడిచిన రెండేళ్లుగా అనేక పోరాటాలు, ఉద్యమాలు, వినూత్న రూపంలో నిరసనలు చేశారు. అయిన అధికార పార్టీ నుంచి కానీ, ముఖ్యమంత్రి నుంచి నేటికి ఎటువంటి స్పందన లేదు. ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి, రాజధాని నిర్మాణం కోసం తాము ఇచ్చిన భూములను పరిరక్షించుకోవడానికి నిరసన తెలుపుతున్న మహిళాలను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లుతూ.. లాఠీలతో కొట్టారు. మహిళా హక్కులను కాలరాస్తూ చేస్తున్న చిత్రహింసలను భరించారు. ప్రభుత్వం నుంచి, పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను సహనంతో భరించారు. సుదీర్ఘ రైతు నిరసన అనంతరం తిరుమలేశునికి తమ గోడు విన్నవించుకోవడానికి ‘న్యాయంస్థానం టూ దేవస్థానం’పేరుతో పాదయాత్రను తలపెట్టారు. కానీ పాదయాత్ర అనుమతులకు అడుగడుగునా అధికార బ్రేకులు పడ్డాయి. బిగించిన బ్రేకులకు ఎక్సకలేటర్ న్యాయస్థానమేనని గ్రహించి హైకోర్టును ఆశ్రయించారు రైతులు. ముందుగా అనుమతులు కోసం డీజీపీని వేడ్కున్నా.. ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు వంటి భగం కలిగించడానికి మీరెవ్వరంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. షరతులతో కూడిన అనుమతులిస్తూ పాదయాత్ర గ్రీన్ సిగ్నల్ లభించింది.
డిసెంబర్ 15 వరకు సాగే పాదయాత్ర..
సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైన రైతు పాదయాత్రకు ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ అని నామకరణం చేశారు. షరతులతో కూడి అనుమతులతో 45 రోజులు పాటు తుళ్లూరు నుంచి తిరుమల వరకు సాగే పాదయాత్రకు అమరావతి జేఏసీ, రైతు సంఘాలు షెడ్యూల్ ఖరారు చేశాయి. పాదయాత్రలో అవాంతరాలు, ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా 20 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇన్ని రోజులు 29 గ్రామాలకే పరిమితమయిన రాజధాని రైతులు పోరాటం ఇకమీదట అన్ని జిల్లాలకు విస్తరింపజేయానే రైతుల లక్ష్యానికి ఈ పాదయాత్ర మరింత ఊతనివ్వనున్నది. దీని కోసం జేఏసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 20 కమిటీలను ఏర్పాటు చేసి, వారిని పాదయాత్రకు బాధ్యులను చేసింది.
నాలుగు జిల్లాల మీదుగా పాదయాత్ర
తుళ్లూరు నుంచి సోమవారం ఉదయం బయలుదేరిన ఈ పాదయాత్రకు ముందుగా ఏడుకొండల స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులనుంచి పూజలందుకున్న స్వామి వారి విగ్రహాన్ని వాహన శ్రేణిలోని ముందు వరసలో ఉన్న వాహనంపై ఉంచుకుని బయలుదేరారు. ముందు వరసలో కళాకారుల బృదం తరువాత మహిళలు ఆ తరువాత రైతులు చివరగా పాదయాత్రకు మద్దతు తెలిపే వారి వరస క్రమాలు కొనసాగుతున్నాయి. అలానే యాత్రలో పాల్గొనే రైతుల జాబితా కాపీలను ఇప్పటికే న్యాయస్థానానికి, డీజీపీ కార్యాలయానికి జేఏసీ నేతలు పంపారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదిగా సాగే ఈ పాదయాత్రకు రూట్ మ్యాప్ అంతా సిద్ధమైంది. ప్రతి రోజూ రెండు విడతలుగా పాదయాత్ర ప్రణాళికలు రూపొందించారు. 12 నుంచి 14 కీలోమీటర్ల వరకు సాగేలా పాదయాత్రకు ఏర్పాట్లు చేశారు. మొదటగా పాదయాత్ర గుంటూరు జిల్లా 6 రోజులుపాటు సాగి, అనంతరం పర్చూరు మీదుగా ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తోంది. నవంబర్ 8 నుంచి 17 వరకు పదిరోజులు పాటు ప్రకాశం జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తూ .. 18 వ తేదీన నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంటారు. అక్కడనుంచి 16 రోజుల పాదయాత్ర అనంతరం డిసెంబర్ 4 కు చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తోంది. 13 రోజులుపాటు చిత్తూరు జిల్లాలోని వివిధ గ్రామాలను చుడుతూ.. అదే నెల 17 కు తిరుమల చేరుకుంటుంది. ఇలా 45 రోజలు పాటు సాగే పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ అంతా సర్వసిద్దం చేశారు జేఏసీ నాయకులు.
పాదయాత్రకు పలు పార్టీa నుంచి పూర్తి మద్దతు
ప్రజా కలల రాజధాని అమరావతి నుంచి చిన్నపాటి ఇటుకను కూడా కదించలేరు అని భీష్మించి తలపెట్టిన రైతు పోరాటానికి ఆది నుంచి అఖిల పక్షం మద్దతు దండిగానే ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు చేస్తున్న దీక్షలో, నిరసనలలో నిజాయితీ ఉంది కాబట్టి. రైతు అక్రందనలు అర్ధం చేసుకున్న పలు పార్టీలు రైతులకు మద్దతు తెలపడంతోపాటు జేఏసీగా ఏర్పడి అవసరమైన సలహాలు, న్యాయ సహాయాలు చేస్తూ వస్తున్నారు. ‘న్యాయంస్థానం టూ దేవస్థానం’ పేరులో తుళ్లూరు నుంచి తిరుమలకు మొదలైన పాదయాత్రకు వివిధ పార్టీలు, పలువురు మేథావులు తమ మద్దతు ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు ఇప్పటికే తమ మద్దతును ప్రకటించగా .. తాజాగా కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘాలు కూడా తమ సంపూర్ణ మద్దతును ప్రకటించడంతో పాదయాత్రకు మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు.
Must Read ;- తాకట్టులో విశాఖపట్నం!