జోమాటో… ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలో ఒక సంచలనం. ఫుడ్ ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే.. ఇష్టమైన డిషెస్ ను నేరుగా ఇంటికే వచ్చి అందిస్తోంది. ఫుడ్ డెలివరీలో జోమాటోకు మించిందిలేదనే చెప్పాలి. స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లు ఎవరైనాసరే ఈ యాప్ ను కచ్చితంగా వాడతారు. అయితే జోమాటో స్థాపించి నేటికీ 14 ఏళ్లు కావోస్తోంది. సరిగ్గా ఇదే నెలలో.. 2008లో జోమాటో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ మొదలైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ తెగ అసక్తిని కలిగిస్తోంది. పేటీఎం సంస్థ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసి.. నెటిజన్లను ఆశ్చర్యపర్చింది.
‘‘ జోమాటో పుట్టినరోజు సందర్భంగా ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. గిఫ్ట్ ఆర్డర్ ఇస్తే.. ఎలాగో తెలిసిపోతోంది కాబట్టి. మీకోసం ఓ అద్భుతమైన కేక్ ఎమోజీ పంపిస్తున్నాం’’ అంటూ ట్వీట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసినా నెటిజన్లు.. ‘జోమాటోకు గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే.. స్విగ్గిలో ఆర్డర్ పెట్టొచ్చు కదా’ అని కొంతమంది.. మీరు పంపిన గిఫ్ట్ మధ్యలోనే స్ర్టక్ అయిందేమోనని మరికొందరు.. గిఫ్ట్ కు బదులు డెరెక్ట్ గా డబ్బులు ఇవ్వొచ్చుగా.. అంటూ ఇంకొంతమంది రిప్లై ఇచ్చారు.
Must Read ;- చికెన్ బిర్యానీలో లెగ్ పీస్ లేదు : ట్విట్టర్ లో కేటీఆర్ కు ఫిర్యాదు
Dear @zomato,
We wish you a Happy Birthday. 🎉
We would have paid for a surprise cake but the order would be from zomato and the surprise would be ruined.
So here's a surprise emoji cake instead. 🎂
— Paytm (@Paytm) July 10, 2021










