పుంగనూరు ఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరుపై మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా కొనియాడారు. ఎప్పుడూ ప్రభుత్వాన్ని, చంద్రబాబును అర్థం లేని ఆరోపణలతో ముంచెత్తే పెద్దిరెడ్డి తాజాగా ప్రభుత్వ తీరును ప్రశంసించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుంగనూరు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి అశ్వియ అంజూమ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని పెద్దిరెడ్డి అన్నారు.
ప్రభుత్వానికి చెందిన ముగ్గురు మంత్రులు స్థానికంగా పర్యటించి నిందితులు అరెస్టయ్యేలా చూశారని కొనియాడారు. అందుకే తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఆ ముగ్గురు మంత్రుల కారణంగానే నిందితులు అరెస్టు అయ్యారని అన్నారు. అందుకే తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు. తిరుపతిలోని తన నివాసంలో సోమవారం పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి ఈ మేరకు స్పందించారు.
పుంగనూరులో ఏడేళ్ల ఓ బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ హత్యకు గురైన చిన్నారి అస్పియా ఫ్యామిలీని కలవడం కోసం ఈనెల 9న జగన్ పుంగనూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే జగన్ పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. చిన్నారి హ*త్యకు వారి వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తేల్చారు. పుంగనూరులో జరిగిన మైనర్ బాలిక హ*త్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు మహిళలతోపాటు ఒక మైనర్ బాలుడుని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో తల్లి, కూతురుతోపాటు మైనర్ బాలుడు ఉన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందని.. విచారణ పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ తెలిపారు.
హ*త్యకు గురైన ఆరేళ్ల చిన్నారి తండ్రి స్థానికంగా ఉంటున్న హసీనా అనే ఓ మహిళ వద్ద రూ.మూడున్నర లక్షలు తీసుకుని ఇవ్వలేదు. పైగా సివిల్ కోర్టులో కేసు వేస్తానని బెదిరించాడు. దీంతో సదరు మహిళ అతనిపై పగ పెంచుకుని.. ప్రతీకారంతో రగిలిపోయి.. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసి హ*త్య చేసింది. హ*త్య అనంతరం చిన్నారిని బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్‌లో పడేసి వెళ్లిపోయింది. మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహం లభ్యమైంది.