ఏపీ ఎంపీల వ్యవహార శైలి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది!
ఐదేళ్లు పదవి.. ప్రభుత్వ హోదా, ఎన్నికల సమయంలో పెట్టిన పెట్టుబడికి పదింతల రాబడి! ఇది చాలు.. ప్రజలు ఎటు పోతేనేం.. రాష్ట్రం ఏమైతేనేం.. అనుకునే పార్లమెంట్ సభ్యులు ఏపీకి ఉండటం ప్రజల దౌర్భగ్యం. విభజిత ఏపీకి కేంద్రం అందించాలని సాయం ఇవ్వడం 2019 జూన్ నుంచే మరిచారు. జగన్ రెడ్డి ప్రభుత్వం, ఆయన పార్టీ ఎంపీలు కేంద్రాన్ని అడగడం కూడా మానేశారు. ప్రత్యేక హోదా బుట్టదాఖాలైంది. విశాఖ రైల్వే జోన్ మరో ముగిసిన అధ్యాయం. నేడు పోలవరం ఆంధ్రుల జీవితాంత కలవరం మాదిరిగానే మిగిలిపోతున్నది. సవితి తల్లి ప్రేమ కన్నా దారుణంగా ఏపీ విషయంలో వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోతోంది. ముక్కుపిండి టాక్సులు వసూళ్లు చేస్తూ ..పెత్తనం చెలాయిస్తున్న కేంద్రాన్ని గట్టిగా నిలదీసి ఏపీకి రావాల్సిన నిధులను, ప్రాజెక్టులను, హక్కు ప్రకారం అందవల్సిన సాయాన్ని జగన్ రెడ్డి ఎందుకు అడుగ లేకపోతున్నారు? అన్నదే ఇక్కడ ప్రశ్న! 2019 లో దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అంశం నేడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావనలోనే లేదు. దీనిపై కేంద్ర నిర్లక్ష్యంపై ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడేళ్లు గడుస్తున్న కేంద్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది!
కొందరి అధికారం దాహం ఏపీకి శాపంగా మారుతున్నాయి. కేంద్ర హామీలు నీటమూటలుగా మారాయని తెలిసి.. ప్రశ్నించలేని పరిస్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కేంద్రం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు కావస్తున్న నేటికి అతి గతి లేదు. 2021-2022 బడ్జెట్ లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేవలం రూ. 40 లక్షల మాత్రమే కేటాయించారు. ఆ డబ్బుతో భవనం నిర్మించడానికి కూడా సరిపోవు. ఇంత తక్కువ కేటాయించడం ఏపీని అవమానించినట్లేనని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. రైల్వే జోన్ ఏర్పాటు చేసి, పూర్తి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో పార్లమెంట్ లో ఉన్న వైసీపీ ఎంపీలు ఈవిషయంలో నోరు మెదపకపోవడం శోచనీయం. ఇటువంటి ఎంపీలను ఎన్నుకున్నంతకు సిగ్గుతో తలదించుకోవాలి. చేవ చచ్చిన ఎంపీలను జీవితంలో ఎన్నుకోకూడదని నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.
Must Read ;- జ్యుడీషియల్ ఎంక్వయిరీకి అంగీకరించే దమ్ముందా? & చంద్రబాబు











