అప్రతిహాతంగా ముందుకు సాగుతున్న పాదయాత్ర!
ఏపీకి ఒకే రాజధాని కావాలని భూములిచ్చిన రైతులు గత 39 రోజులుగా సాగుతున్న పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో రైతులు పాదయాత్రను ముగించుకుని చిత్తూరు జిల్లాలో ప్రవేశించిన రైతులకు అఖండ స్వాగతం లభించింది. గురువారం ఉదయం చింతలపాలెం నుంచి ప్రారంభించిన రైతుల పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. శ్రీకాళహస్తిలో బస చేసేందుకు అన్నదాతలకు ఏర్పాటు చేసుకున్న కల్యాణమండపాన్ని అధికారపార్టీ ఒత్తులతో నిర్వాహకులను వెనక్కి తీసుకునేలా చేశారు. ఇదిలా ఉంటే చింతలపాలెం వద్ద మహిళా రైతులకు ఘన స్వాగతం లభించింది. సీపీఐ నేత నారాయణ సంఘీభావం తెలిపారు. రాజధాని విషయంలో అధికార వైసీపీ అవలంభిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపనీయమన్నారు. పోలీసులు అనుమతించకపోయినా తిరుపతిలో సభ నిర్వహింస్తామని స్పష్టం చేశారు.
మూడు రాజధానుల వెనుక పులివెందుల ఫ్యాక్షన్ హస్తం!
మూడు రాజధానుల వెనుక పులివెందుల ఫ్యాక్షన్ హస్తం ఉందని పులివెందుల రైతులు అభిప్రాయపడ్డారు. శ్రీకాళహస్తిలో అమరావతి రైతులకు పులివెందుల రైతులు గురవారం సంఘీభావం తెలిపారు. పులివెందులకు పరిమితమైన సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోందని వాపోయ్యారు. 175 నియోజకవర్గాల ప్రజలు ఏపీ రాజధాని అమరావతే కావాలని కోరుకుంటున్నారని రైతులు వివరించారు.
Must Read ;- దివికేగిన దేశ భక్తుడు బిపిన్ రావత్..! ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కు కారణాలివేనా!!