పది ప్లాపులిచ్చిన సీనియర్ డైరెక్టర్ కన్నా.. ఒక్క సూపర్ హిట్టిచ్చిన చిన్న దర్శకుడే ఇండస్ట్రీలో తోపు. అతడి వెనుకే నిర్మాతలు క్యూ కడతారు. అలాగే.. హీరోలకి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా సూపర్ హిట్టుకొట్టిన ఓ దర్శకుడు, హీరో కాంబో మూవీ సెట్ అయిందని సమాచారం. ఆ హీరో ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ అయితే.. ఆ దర్శక జాతిరత్నం అనుదీప్ కేవీ. ఈ ఇద్దరి కలయికలోని ఒక భారీ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.
బీవీయస్.యన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఉప్పెన విడుదల కు ముందే క్రిష్ సినిమాని కంప్లీట్ చేసి.. షాకిచ్చిన వైష్ణవ్.. ఇప్పుడు క్రిష్ మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే… మరో సినిమాకి కమిట్ మెంట్ ఇవ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి సూపర్ కలెక్షన్స్ తెచ్చిపెట్టిన సినిమాలతో పేరు తెచ్చుకున్న వైష్ణవ్, అనుదీప్ .. త్వరలో ఎలాంటి సినిమా ఇవ్వబోతారో చూడాలి.
Must Read ;- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో ఎనర్జిటిక్ స్టార్ ?