ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలం పర్యటనలో మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకేష్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన పట్ల చూపించిన అభిమానం అక్కడున్నవారందరిని ఆశ్చర్యపరిచింది. మోదీకి ఆహ్వానం పలికే సమయంలోనూ లోకేష్ చాలా బరువు తగ్గారంటూ మోదీ కామెంట్ చేశారు. ఇక తర్వాత వేదికపైనా లోకేష్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు మోదీ. జ్ఞాపిక అందించే సమయంలో చంద్రబాబు పక్కన ఉన్నా సరే దూరంగా ఉన్న లోకేష్‌ను దగ్గరకు పిలిచి ఆయన చేతుల మీదుగా ఆ జ్ఞాపికను అందుకున్నారు మోదీ. లోకేష్ పట్ల మోదీ చూపించిన అభిమానానికి బీజేపీ నేతలు సైతం ఆశ్చర్యపోయారు.
లోకేష్‌కు మోదీ ప్రాధాన్యత ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి లోకేష్ చేసిన కృషి మోదీని విశేషంగా ఆకర్షించింది. చంద్రబాబును జగన్ సర్కార్ కుట్ర పూరితంగా జైలులో పెట్టిన సమయంలో ఢిల్లీలో లోకేష్ ప్రదర్శించిన చాణిక్యం కూడా లోకేష్‌పై మోదీ అభిమానం పెంచుకునేందుకు కారణమైంది. ఇక ఇప్పుడు ఏపీకి అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టేందుకు లోకేష్ చేస్తున్న పనులు మోదీని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం లోకేష్ జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నారు. గూగుల్ లాంటి సంస్థను విశాఖకు తీసుకురావడంలో లోకేష్ పాత్ర ఎంతో ఉంది. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలోనూ లోకేష్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. భవిష్యత్‌లో ఈ దేశ రాజకీయాలను మార్చే యువనేతల్లో లోకేష్ ఒకరని మోదీ భావిస్తున్నారు. అందుకే లోకేష్‌ను కలిసిన ప్రతీసారి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు మోదీ.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో లోకేష్‌ను కుటుంబం సహా ఢిల్లీకి రావాలని స్వయంగా ఆహ్వానించారు మోదీ. ఈ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన లోకేష్ మోదీతో కుటుంబసమేతంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకుపైగా లోకేష్ కుటుంబంతో మోదీ మాట్లాడారు. యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు. మాములుగా మోదీ యువనేతలతో భేటీ కావడం చాలా అరుదు. కానీ లోకేష్ అడగగానే అపాయింట్‌మెంట్లు ఇచ్చేస్తుంటారు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమంను సక్సెస్ చేసిన టైంలోనూ లోకేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా యోగాంధ్ర కార్యక్రమం గురించి ప్రస్తావించారు











