పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ఈ సందర్భంగానే గంగూరు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా దాదాపు 19.20 లక్షల నగదును పట్టుకున్నారు. దీనికి సంబంధించి కర్నూలుకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బుకు సంబంధించి ఎక్కడ నుంచి తెస్తున్నారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. అదుపులోకి తీసుకున్న వారిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నానట్లు సమాచారం. వారు కర్నూలు వాసులు మాత్రం పోలీసులు వెల్లడించారు. ఇది హవాల సోమ్మా లేదా ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది.
Also Read: పంచాయతీ ఎన్నికలను రాజకీయం చేయడం తగదు: డీజీపీ











