పలు జిల్లాలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..
రాష్ట్రంలో పలు జిల్లాలో గురువారం విద్యుత్ నిలిచిపోయింది. గంటలకొద్ది విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో అధికారులు విద్యుత్ ను నిలివేశారు. సాయంత్ర 6 గంటలకు నుంచి చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దాదాపు ఐదు జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గటంతో 3 డిస్కంల పరిధిలో కోతలు విధించాల్సి వస్తోందన్నారు. వీటీపీఎస్, ఆర్టీపీ, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాల్లో 1700 మెగావాట్ల మేర ఉత్పత్తి తగ్గినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు గంటల మేరకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది!
ఎమర్జెన్సీ లోడ్ కేవలం సాకు మాత్రమే!
ఏపీ వ్యాప్తంగా విద్యుత్ కోతలు కావాలనే ప్రభుత్వం విధించిందని పలు ఆరోపణలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రమంతా పవర్ కట్ చేస్తూ అనధికారికంగా ప్రభుత్వం సంచలానాత్మక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వార్తా ప్రసారాలను ప్రజలు ఎవరూ చూడకూడదని నిలువరించే ప్రయత్నంలో భాగంగానే విద్యుత్ సరఫరాను నిలిపివేశారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఉదయం కృష్ణాజిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను, సెల్ ఫోన్ సిగ్నల్స్ ను పూర్తిగా నిలిపివేసి ప్రజలను అవస్థలపాలు చేశారు. అంతటితో ఆగకుండా రాత్రులు కూడా ఇలా పవర్ ను కట్ చేసి, ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సబబు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Must Read:-ఏపీలో సెగలు రేపుతున్న జిల్లాల పునర్విభజన! అధికారపార్టీ నేతల్లో తలెత్తిన అభిప్రాయబేధాలు!