జిల్లా సాధించే వరకు ఉద్యమం విరమించేది లేదు..!
హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో నిర్వీరామ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం పట్టణంలో మౌన దీక్షకు పిలుపునిచ్చారు. స్థానికంగా ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లా కేంద్రం ఏర్పాటు అవశ్యకతపై ప్రసంగిస్తారు. ప్రసంగం ముగిసిన తరువాత అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపడతారు. మౌన దీక్ష ముగిసిన తరువాత సాయంత్రం అఖిల పక్షంతో చర్చించి, తదుపరి ఉద్యమ కార్యచరణపై స్పష్టతనివ్వనున్నారు.
హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలి..
హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలి, దీనిని రాజకీయం చేయొద్దు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. హిందూపురాన్ని సత్యసాయి జిల్లాగా ప్రకటించాలని గత కొంతకాలంగా బాలకృష్ణ డిమాండ్ చేస్తునే వస్తున్నారు. వైకాపా ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్ సభ కేంద్రాన్ని ఒక జిల్లా చేయాలని ఆయన గుర్తు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తన వీడియో సందేశంలో ప్రభుత్వాన్ని కోరారు. అన్ని రంగాల్లో హిందూపురం అభివృద్ధి చెందిందని.. జిల్లా కేంద్రానికి అవసరమయ్యే సదుపాయాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయని వివరించారు. జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో రాజకీయాలకు తావువివ్వకుండా తక్షణమే హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేశారు.
Must Read:-ఎన్టీఆర్ స్మారకంగా నందమూరి బాలకృష్ణ శ్రీరామదండకం