June 8, 2026 10:22 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

తెలుగు సినిమాకి ఆయన ఓ ‘మెగా లెన్స్’

మౌనంగానే ఎదగమని మొక్క మనకు చెబుతుందని.. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థం అందులో ఉందని ఆయన తన సినిమా ద్వారానే మనకు చెప్పారు. అందుకే ఆయన అపజయాలు ఎరగలేదు.. గెలుపు పిలుపును అందుకున్నారు. ఆయనే లెజండరీ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాలరెడ్డి. అందుకే ఈ రంగుల రాట్నానికి ఇదే ఆయన ఆటోగ్రాఫ్. ఆ స్వీట్ మెమరీస్ ఇవే.

March 10, 2021 at 4:19 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సినిమా అనేది ఓ అద్దాల మేడ.. కానీ ఆ అద్దాలే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.. ఆ మేడలో ఆయనకు ఎంతో చోటిచ్చాయి. ఆయనే సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాలరెడ్డి. ఇంకా చెప్పాలంటే ఇవాళ ఆయన ఇల్లే ఓ అద్దాల సౌధం. ఎందుకంటే ఆయన కుమారుడు సందీప్, కుమార్తె సంధ్యలకు కూడా ఆ అద్దాలతోనే అనుబంధం.

2000 సంవత్సరంలో ‘ఈనాడు సినిమా’ రిపోర్టర్ గా నేను కూడా ఈ అద్దాల మేడలోకే అడుగుపెట్టాను. ఎప్పుడూ నటుల ఇంటర్వ్యూలేనా టెక్నిషియన్ల ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుంది కదా అనిపించింది. అలా వెతికిన నా కంటికి ఓ సినిమాటోగ్రాఫర్ కనిపించారు. పైగా ఆయన నిర్మాత కూడా. అలా గోపాల రెడ్డితో నాకు కూడా ఓ బంధం ఏర్పడింది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై ‘సంతోషం’ సినిమా నిర్మిస్తున్న రోజులవి. బహుశా 2001 అనుకుంటాను. ఫోన్ చేయగానే ఆయన ఇంటర్వ్యూ ఓకే చేశారు. సినిమా రంగంలో చాలా మందికి ఓ విధమైన గర్వం ఉంటుంది. కానీ ఈయన చూస్తే నిరాడంబరంగా కనిపించారు. మాట తీరులోనూ మృదుత్వం. బహుశా ఆ గుణమే సినిమా రంగంలో ఆయనను అజాతశత్రువును చేసిందేమో.

మాట సాయం చేయడంలోనూ మేటి..

ఇంటర్వ్యూ ప్రింటయ్యాక చాలా బాగుందని థాంక్స్ చెప్పారు. ఆ కొద్దిపాటి పరిచయమే మా దగ్గర ఉంది. ఆ సినిమాకి దర్శకుడు దశరథ్ దగ్గర నాకు తెలిసిన వాసు అనే కుర్రాడు అప్రంటిస్ గా చేరాడు. అతనా పోస్టులో చేరడానికి ఓ మంత్రి రికమెండేషన్ కూడా తెచ్చుకున్నాడట. సినిమా రంగంలో ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరాలంటే మంత్రి రికమెండేషన్ దాకా వెళ్లాలా అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఓ రోజు వాసు ‘అన్నయ్యా నా దగ్గర మంచి కథ ఉంది.. ఈ కథ నాగార్జునకు అయితే బాగుంటుంది. కథ వినే అవకాశం కల్పించగలవా?’ అనడిగాడు. నాకు మొహమాటం ఎక్కువ. వెంటనే గుర్తొచ్చి గోపాల రెడ్డి గారికి ఫోన్ చేస్తే బాగుంటుందనిపించింది. ఫోన్ చేసి విషయం చెప్పా. అలాగే అదెంత పని అన్నారాయన.

ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సినిమా రంగంలో కొందరు మాట సాయం చేయడానికి కూడా ముందుకు రారు. వాసు అన్నపూర్ణ స్టూడియోలో కథ చెప్పే దాకా వెళ్లాడు కానీ ఆ కథ ఓకే కాలేదు. ఆ తర్వాత నేను గోపాల రెడ్డి గారిని నేరుగా కలిసే అవకాశం రాలేదు. ఓ నాలుగేళ్ల క్రితం అనుకుంటాను ఓ మిత్రుని ద్వారా ఆయన్ని కలిసే అవకాశం వచ్చింది. ఆయనను చూస్తే ఓ ఆత్మబంధువును చూసినట్టుంటుంది. అప్పట్నుంచి ఇప్పటికీ మా మధ్య ఆత్మీయాతానుబంధమే. దానికి కారణం ఆయన పాజిటివ్ థింకింగ్. తన మాటల వల్లగాని, చేతల వల్ల గానీ ఎవరూ హర్ట్ కాకూడదన్నది ఆయన అభిప్రాయం. అందుకే సాధారణంగా ఇంటర్వ్యూలకు ఆయన దూరంగా ఉంటారు. రెండ్రోజుల క్రితం మళ్లీ వీడియో ఇంటర్వ్యూ కావాలని అడగ్గానే రమ్మన్నారు.

Also Read ;- సినిమా చూపించాడు మామా

మౌనంగానే ఎదగమనే తత్వం

ఓ సినిమాటోగ్రాఫర్ కు సాహిత్యం మీద అభిరుచి ఉండటం కూడా విశేషమే. మార్కెట్లోకి మంచి పుస్తకం వస్తే అది ఆయన ఇంట్లో ఉండాల్సిందే. ఓసారి కాచిగూడలో తెలుగు బుక్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన నుంచి ఫోన్ వచ్చింది. ఫలానా పుస్తకం కావాలి అన్నారు. ఆయనకు పుస్తకాల మీద అంత మక్కువ ఏర్పడటానికి కారణం జంధ్యాల. రచయితగా, దర్శకుడిగా ఎంతో పేరుతెచ్చుకున్న జంధ్యాలతో కలిసి ఆయన కొంత కాలం రూమ్ లో ఉండటం కూడా ఓ కారణం. ఆయనతో ఉన్న స్నేహం తనలో ఎంతో మార్పు తెచ్చిందంటారు గోపాల రెడ్డి.

ఆయన సొంతూరు కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని తేలప్రోలు. ఒకవిధంగా చెప్పాలంటే వారిది కమ్యూనిస్టు కుటుంబం. తండ్రికి సినిమా రంగంతో కొంత అనుబంధం ఉండటంతో మద్రాసు వెళ్లాల్సి వచ్చిందాయనకు. వీనస్ స్టూడియో అప్రంటిస్ గా చేరాక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.ఆర్. స్వామి దగ్గర అసిస్టెంట్ గా చేరే అవకాశం దొరికింది. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ గా మారి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు. మాట సాయమే కాదు అయ్యో అనిపిస్తే ఆయన ధన సాయం కూడా చేయడానికి వెనకాడరు. అయితే అలా సాయం చేసిన విషయాన్ని బయటకు చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడరు.

అన్నిశాఖల్లోనూ అభినివేశం

సినిమా రంగంలో సినిమాటోగ్రాఫర్ గా అడుగుపెట్టిన ఆయన ఒక్క శాఖకే పరిమితం కాలేదు. జంధ్యాల సహచర్యం కారణం వల్ల కథ మీద పట్టుదొరికింది. కె.ఎల్. నారాయణతో ఏర్పడిన స్నేహబంధం దుర్గా ఆర్ట్స్ బ్యానర్ స్థాపన దాకా వెళ్లింది. క్షణ క్షణం, ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు, హలో బ్రదర్, సంతోషం.. ఇలా అనేక విజయాలు సొంతమయ్యాయి. రవితేజ ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ చిత్రంతో మెగాఫోన్ చేతబట్టక తప్పలేదు. పాటల చిత్రీకరణలో ఆయనకున్న అభినివేశం ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ప్రతిచిత్రంలోనూ కనిపిస్తుంది. దర్శకుడిగా ఆయన తొలి చిత్రంలో ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది’ అనే పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఆ పాట ఉందనడం అతిశయోక్తి కాబోదు.

Must Read ;- ఈ సినిమా బామ్మలు నిజ జీవితంలో అమ్మ కాలేదా..?

రాంగోపాల్ వర్మ దర్శకత్వం చేపట్టబోతూ తనకు సినమాటోగ్రాఫర్ గా గోపాల రెడ్డే కావాలని పట్టుబట్టారంటే ఆయన ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఐదు దశాబ్దాల ఆయన సినిమా రంగ జీవితం మరెందరికో స్ఫూర్తిదాయకం కూడా. ఆయన నిర్మాతగా బాలకృష్ణ హీరోగా ‘శిల్పి’ అనే ఓ కథను ఎంచుకున్నారుగానీ అది కార్యరూపం దాల్చలేదు. దానికి వెనక పెద్ద కథే ఉంది. తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తాడనడానికి ఇదే ఉదాహరణ. నిర్మాతగా తన స్నేహితుడు నష్టపోకూడదన్నది జంధ్యాల అభిప్రాయం.

‘శిల్పి’ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే సమయానికి జంధ్యాల వెర్షన్ మారిపోయింది. మొదటి చిత్రంతో రిస్క్ ఎందుకు చేయాలి. ఎన్టీఆర్ నటించిన హిట్ చిత్రం ‘వద్దంటే డబ్బు’ కథను కొద్దిగా మార్చి సినిమా చేసేద్దాం అన్నారట. అందుకు బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ‘బాబాయ్ అబ్బాయ్’ చేశారు. నిజానికి ఈ సినిమావల్లే చేతులు కాలాయి. ‘శిల్పి’ చేసి ఉంటే బాగుండేమో అని కూడా అనిపించింది. అన్నట్టు ఒక టెక్నీషియన్ కోసం నందమూరి బాలకృష్ణ 25 శాతం రెమ్యూనరేషన్ తగ్గించుకుని ఈ సినిమా చేశారట.

తెరవెనుక సంగతులెన్నో..

సినిమా రంగంలో లోపల జరిగేది ఒకటి బయటికి కనిపించేది ఇంకొకటి. గోపాల రెడ్డిగారిని కలిసిప్పుడు మనకు చాలా కొత్త విషయాలు తెలిశాయి. బాలీవుడ్ దగ్గజం అమితాబ్ బచ్చన్ తో ఆయన పనిచేశారు. ఆయన చెప్పిన విషయాలు విన్నాక అమితాబ్ ఇంతటి మేధావా? అనిపించకమానదు. అలాగే ‘క్షణక్షణం’ సినిమాకి ముందు అనుకున్న కథ ఒకటి, తీసింది ఇంకొకటి. నటి శ్రీదేవి తనకు నచ్చిన ఓ హాలీవుడ్ కథ స్ఫూర్తితో రాంగోపాల్ వర్మ ఈ క్షణక్షణం కథ తయారు చేశారట. ఇక ఈ సినిమాలో శ్రీదేవి ఓ పాట కూడా పాడిన సంగతి తెలిసిందే. ఆ పాట ఆమె పాడితేనే బాగుంటుందని వర్మ అనడం, ఆమెను ఒప్పించడానికి గోపాల రెడ్డిగారే రంగంలోకి దిగాల్సి వచ్చింది.

‘కింగ్ లా కనిపిస్తున్నాడు.. మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు’అనే పల్లవితో సాగే పాట ఇది. ఆమెను కలవడానికి గోపాల రెడ్డి ముంబయిలో స్టూడియోకి వెళితే అక్కడ శ్రీదేవికి లభిస్తున్న గౌరవం చూసి ఆశ్చర్యపోయారట. నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగుల్లో ఎలాంటి రిస్క్ లు చేస్తారన్నది కూడా ఆయన మాటల్లో తెలుసుకోవలసిందే.  దుర్గా ఆర్ట్స్ ఇప్పుడు ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబునీ, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని ఒకే వేదకి మీదకు తీసుకు రాబోతోంది. ఈ బృహత్తర బాధ్యత కూడా గోపాల రెడ్డి భుజస్కందాలపైనే ఉంది. సినిమాని ప్రేమించడం మొదలుపెడితే జీవితం చివరిదాకా దాంతోనే ప్రయాణం చేయాలని అనిపిస్తుందంటారాయన. ఆ సంకల్ప బలంతోనే ముందుకు సాగుతున్నారు గోపాలరెడ్డి.

– హేమసుందర్ పామర్తి

Also Read ;- అగ్ర దర్శకులు చేతుల్లో కథల కార్ఖానాలు

Tags: b gopal reddycamera man gopal reddycelabreties about gopal reddycinematograher gopal reddy interviewsCinematographer S. Gopala Reddyfilmography of s. gopala reddygopal reddygopal reddy about cinema industrygopal reddy about tollywoodgopal reddy cameramangopal reddy directorgopal reddy familygopal reddy moviesgopal reddy on stagegopal reddy producergopal reedy cinematogrphergopl reddy sonleotopmovie opening by gopal reddyproducer gopal reddy familyproduer gopal reddy suggstions to up coming film makerss gopal reddy cinematographersantosham movietips by camera man gopal reddy
Previous Post

చిరు ‘ఆచార్య’ మూవీ విడుదల లేటవుతుందా?

Next Post

వైసీపీలో వెన్నుపోటుదారులున్నారు : రోజా

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist