పాదయాత్ర ముగింపు సభ …. అదే మహోద్యమ సభ!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూమిలిచ్చిన రైతులు నేడు రోడ్డెక్కారు. దాదాపు 500 కిలో మీటర్ల ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పాదయాత్ర చేసి.. శ్రీవారిని దర్శించుకున్నారు. రాజధాని రైతు జీవితంలో శాంతి కరువై.. నేటి 727 రోజులు. ఇన్ని రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ .. ముందుకు సాగుతన్నారు రైతులు. అయిన ఏపీ ప్రభుత్వంలో కనీసం చలనం లేదు. పాదయాత్రను దిగ్విజయంగా ముగించుకుని రేపు తిరుపతిలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’ ను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణంలో వేదోక్తంగా భూమి పూజను నిర్వహించి, ఏర్పాటు పనులను చకచక పూర్తి చేస్తున్నారు జేఏసీ నేతలు.
మొత్తం 20 ఎకరాల్లో సభ ప్రాగణం!
అమరావతి పరిరక్షణ మహోద్యమ సభను మొత్తం 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ వేదికపై వీవీఐపీ, వీఐపీ, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఒక్కరూ చూసేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లను సభ ప్రాగణంలో ఏర్పాటు చేశారు. సభకు ఎంతమంది వచ్చిన అందిరికి భోజనాల ఏర్పాట్లును సిద్ధం చేశారు. దాదాపు 20 ఎకరాల్లో తీర్చుతున్న మహోద్యమ సభ వేదికగా ఏపీకి ఒకటే రాజధాని .. అది అమరావతేనని గొంతెత్తి చాటేందుకు రైతుల సంసిద్ధమౌతున్నారు. ఈ సభకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం వంటి అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. వీరితోపాటు ప్రజా,రైతు, వర్తక, వాణిజ్య సంఘాలను ఆహ్వానించారు.
Must Read ;- ముగిసిన పాదయాత్ర ..! 44 రోజుల్లో రైతులపై పెట్టిన కేసులెన్నో తెలుసా..!!











