రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే దానిపై వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడి, మిమ్మలి ఎలా దారికి తేవాలో తెలుసు అంటూ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరించారు. తదనంతరం వైసీపీ నాయకులు పవన్ కు కౌంటర్లు వేశారు. జనసైనికులు, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినీ నటుడు, జగన్ అభిమాని అయిన పోసాని మురళీకృష్ణ పవన్ కల్యాణ్ వ్యక్తగత, రాజకీయ విధానాలపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. దీనికి స్పందిస్తూ వైసీపీ నాయకులను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ‘‘తుమ్మెదల ఝుంకారాలు. నెమళ్ళ క్రేంకారాలు. ఏనుగుల ఘీంకారాలు. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే’’అంటూ అలాగే నాకు ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అంటూ ” హు లెట్ ది డాగ్స్ ఔట్” సాంగ్ లింక్ ను పోస్ట్ చేస్తారు. కాగా వైసీపీ ప్రభుత్వ పాలనను వైసీపీ ఉగ్రవాదుల పాలనగా పోల్చుతూ.. వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది’’ అంటూ ట్విట్ చేశారు.
జనసేన బరిలోకి దిగినట్టే
వైసీపీ ప్రభుత్వ విధానాలను ఉగ్రవాద పాలసిలుగా, విధానాలుగా పవన్ కల్యాణ్ పోల్చడం ద్వారా వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నట్లు అర్థమవుతుంది. అలాగే వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాద పాలసీలపై పోరాడేందుకు సమయం అసన్నమైయింది అంటూ ట్విట్ చేయడం చూస్తుంటే ఇన్ని రోజులు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచక చర్యలపై చూసి చూడనట్టు ఉన్న జనసేన ఇకపై రాజీ లేని పోరాటాలు నిర్వహించేందుకు సిద్ధమైతోంది అని సంకేతాలు ఇచ్చినట్లు కనబడుతోంది. కాగా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇప్పటివరకు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తోంది టీడీపీ. కాగా ఇప్పుడు జనసేన కూడా వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాల స్పీడు పెంచితే ప్రజలలో వైసీపీపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది.
ఆలయాలపై దాడులపైనా ఫైరింగ్
కాగా వైసీపీ ప్రభుత్వం ఉగ్రవాద పాలసీని అనుసరిస్తోందని, దానిపై సమరానికి సమయం అసన్నమైయింది అనే ట్వీట్ తరువాత పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ లో రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన అంశంపై మరో ట్వీట్ ను సంధించారు. ఈ ట్వీట్‌లో ‘‘ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి. హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?’’ అంటూ పవన్ విరుచుకుపడ్డారు. ఇదే ట్వీట్ ను హిందీ, తెలుగు భాషలలో వేరు వేరు పోస్ట్ లలో ట్విట్ చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.
Must Read ;- పీకే వర్సెస్ పోసాని.. హద్దులు దాటేసింది