నాడు భీరాలు .. నేడు భేరాలు ..!
నాడు 25 మంది ఎంపీలను ఇవ్వండి మోదీ మెడలొంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం భీరాలు పలికి .. నేడు అప్పులు కోసం మోడీ పంచన చేరి అడుగులకు మడుగులొత్తుతున్నారు! ఇది కాదా దౌర్భాగ్యమని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నా .. జగన్ రెడ్డికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం! జగన్ రెడ్డిని నమ్మి ఓట్లేసి 22 మంది ఎంపీలను గెలిపిస్తే నేడు చేస్తున్న నిర్వాకం ఇదా.. అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పుడున్న పరిస్థితిలో అత్యవసరం! ఎందుకంటే.. ఈశాన్య రాష్ట్రాల కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం పడిపోయింది కాబట్టి! నేడు దేశ బడ్జెట్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కుమ్మరించిన ఇక్కడున్న ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే సమస్యే లేదన్నది సర్వేలు చెబుతున్న వాస్తవాలు!! పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు పదే పదే ప్రత్యేక హోదా పై నిలిదీస్తుంటే.. వైసీపీ ఎంపీలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని మాట్లాడుతున్నారు. దీనిబట్టి చస్తుంటే .. కేంద్రానికి జగన్ రెడ్డికి మధ్య కుదిరిన భేరం కారణంగానే ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలు తాకట్టుపెట్టబడ్డాయన్నది వాస్తవం.
గొర్రె కసాయినే నమ్మినట్లు .. గొంతు కొస్తుంటే అర్థం కావడంలేదా??
గొర్రె కసాయినే నమ్మినట్లు .. నిలువున గొంతు కొస్తుంటే మీకేందుకు అర్థంకావడంలేదా? అని ఏపీ ప్రజలు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారుసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిందని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇది ఏపీకి మాత్రమేనంటా..! అయితే ఏపీ కాదని ఏ రాష్ట్రానికైనా.. ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అంగీకరిస్తాయని నేడు కేంద్రం పలకడం మోసం కాదా? అది జగన్ రెడ్డికి ఎందుకు అర్థంకావడం లేదని? విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని నితిష్ లేఖ రాయగానే .. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పందిస్తారు. చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నామని సమాధానం కూడా పంపుతారు. మరి ఏపీ పరిస్థితేంటి మిస్టర్ జగన్ రెడ్డి అని ఏపీ ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి చిన్నపాటి లేఖతోనే చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నామని సమాధానమిచ్చే కేంద్రం .. 25 మంది ఎంపీలు ఏడునరేళ్లుగా చట్టసభల్లో మొత్తుకుంటుంటే ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పుకొస్తున్న బీజేపీని ఇంకా నమ్మి.. ఏపి ప్రజలను వంచిచాలా? అని ఆరోపణలు మిన్నంటుతున్నాయి. కేంద్రం కుటీల రాజకీయాన్ని, జగన్ రెడ్డి ఉదాసీనత వైఖరిని జేడీ లక్ష్మీనారాయణ తప్పుపట్టారు.హోదా విషయంలో జగన్ రెడ్డి వహిస్తున్న నిశ్శబ్ధం ఏపీకి శాపంలా మారుతోందని మేథావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోదా కోసం ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా పోరాటం సలిపి.. సాధించుకోవాల్సని అవసరం, ఆవశ్యకత అందరిపై ఉందని జగన్ గుర్తించాలి!
Must Read ;- ఏపీకి ప్రత్యేక హోదా..! కాలగర్భంలో కలిసే ఓ గతమేనా?











