అధికార పక్షం, ప్రతి పక్షాల మధ్య అప్పుడప్పుడూ గొడవులు జరగడం సహజమే కావచ్చు. కానీ అవి ఒక్కోసారి శృతిమించి పోవడం వల్ల కొన్ని సంఘటనలు ఉద్రిక్తతలకు దారితీస్తాయి. అటువంటి సంఘటనే చోటుచేసుకుంది అనపర్తిలో. అక్కడి స్థానిక ఎమ్మెల్యే సుర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఒకరిపై తీవ్ర ఆరోపణలకు దిగారు. ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేయడంతో పరిస్థితి కాస్త అదుపుతప్పింది.
అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే అనడంతో, అక్కడ స్థానిక ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు కాస్త ప్రమాణాలు దాకా వెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి బిక్కవోలు గణపతి గుడిలో ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
ఈ గొడవ గురించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కబరిచే చర్యలు చేపట్టారు. పోలీసులను మోహరించి పరిస్థితి అదుపు చేయడానికి ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పకుండా ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించి.. పోలీస్ చట్టం 30 అమలు చేస్తునట్టు తెలియజేశారు. ఇరువర్గాలు గుడికి వెళ్లాలనే నిర్ణయానికి పోలీసులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ వారి వెంట ఐదుమంది మాత్రమే ఉండాలని పోలీసులు ఆదేశించారు. మరి మధ్యాహ్నం అక్కడకు చేరుకున్న తర్వాత ఏం జరగనుందో చూడాలి!
Must Read ;- వైసీపీ సర్కారు నయా ప్లాన్.. చట్టపరంగా ప్రభుత్వ భూముల కబ్జా











