కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై స్టే విధిస్తూ.. సమస్యకు పరిష్కారం చూపించేందుకు గాను నలుగురు సభ్యుల కమిటీని సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది. సామరస్య పూర్వంగా సమస్యను పరిష్కరించుకోవడమే మార్గమని సూచించింది. ఇక ఈ కమిటీలోని సభ్యులు ఒకరు నాటి అవిభాజ్య భారత్, ప్రస్తుత పాకిస్తాన్‌లో పుట్టిన వ్యక్తిగా ఉండడం గమనార్హం. ఈ కమిటీలో ఇద్దరు ఆర్థిక వేత్తలు కాగా మరో ఇద్దరు రైతు సంఘాల్లో పనిచేసినవారు.
. అశోక్ గులాటి..ఈయన వ్యవసాయ ఆర్థికవేత్త. ఇన్ఫోసిస్ ఛైర్ ప్రొఫెసర్. కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ (CACP) మాజీ ఛైర్మన్‌గా పని చేశారు. ఇక వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర సలహాదారుగా కూడా పని చేశారు. 2015లో పద్మశ్రీ అవార్డు గ్రహీత. నీతి వ్యవసాయ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడుగా ఉన్నారు. వ్యవసాయ మార్కెట్ సంస్కరణలపై నిపుణుల ప్యానెల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అనేక పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) పెంచడంలో గులాటి కీలక పాత్ర పోషించారు.వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక సలహాదారు ప్యానెల్‌లో ఉన్న అతిపిన్న వయస్కుడిగా అప్పట్లోనే పేరొందారు. అగ్రికల్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యుడిగా ఉండడంతో పాటు ICICI బ్యాంకింగ్ కార్పొరేషన్‌కి డైరక్టర్‌గా కూడా కొనసాగుతున్నారు.
Must Read ;- ఆంధ్రా, పాకిస్తాన్‌ని తలపిస్తుంది..
- డాక్టర్ ప్రమోద్ కే జోషి.. ఈయన కూడా వ్యవసాయ ఆర్థిక వేత్త. ఉత్తరాఖండ్‌కి చెందిన వ్యక్తి. వ్యవసాయ, ఆర్థిక అంశాలపై దాదాపు 20 కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ సైంటిస్ట్‌గా , ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్‌గా, సెంట్రల్ సాయిల్ సాలినిటీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ హెడ్‌గా, ఇక్రిశాట్ సీనియర్ ఎకనామిస్ట్‌గా ఉన్నారు. పలు అంతర్జాతీయ పరిశోధనా సంస్థలకూ సలహాదారుగా ఉన్నారు. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థలో దక్షిణ ఏసియా సమన్వయకర్తగా పని చేశారు. వ్యవసాయ రంగంలో చేసిన కృషికి ఆయన అనేక అవార్డులు అందుకున్నారు.
- భూపిందర్‌సింగ్ మన్.. రైతు నేత. అవిభాజ్య భారత్, ప్రస్తుత పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలాలో 1939 సెప్టెంబర్ 15న జన్మించారు. తొలుత రైతు ఫ్రెండ్స్ అసోసియషన్‌ను 1966లో ఏర్పాటు చేశారు. తరువాత ఇది పంజాబ్ ఖేతీ భరీ యూనియన్‌గా మారింది. అనంతరం జాతీయస్థాయిలో భర్తీ కిసాన్ యూనియన్ (బీకేయూ)గా మారింది. ఇతర రైతు సంఘాల సమన్వయంతో ఏర్పాటైన కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ వ్యవస్థాపకుడుగా ఉన్నారు. 1967లో జనసంఘ్ కొందరి రైతుల సమస్యలపై పోరాడేందుకు సలహాలూ కూడా ఇచ్చిన వ్యక్తి. 1947లో దేశ విభజన సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న మన్..ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొవాల్సి వచ్చింది. అప్పట్లోనే 1968లోనే FCIలో అవినీతిపై పోరాడారు. 1972లో చెరుకు రైతులకు మద్దతుగా ఉద్యమం చేపట్టారు. దీంతో కేంద్ర చట్టాల్లో మార్పులు చేసేలా ఒత్తిడి తేగలిగారు. 1975లో ఎమర్జన్సీ సమయంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తరువాత వ్యవసాయంలో వినియోగించే ట్రాకర్లలో ఉన్న లోపాలకు వ్యతిరేకంగా ఉద్యమించి..ట్రాక్టర్ల తయారీ కంపెనీలను ఒప్పించి.. వ్యవసాయానికి అనుగుణంగా ట్రాకర్టను తయారు చేయించిన ఘనత కూడా మన్ కే దక్కుతుందని చెబుతుంటారు. డీజిల్ ఉద్యమం, ఆలుగడ్డలకు మద్దతు ధర తదితర ఉద్యమాలు చేసి విజయం సాధించిన వ్యక్తిగా పేరుంది. 1984లో పంజాబ్ రాజ్‌భవన్ ముట్డడి కార్యక్రమం సంచలనం రేపింది. ఈ ఉద్యమానికి కూడా మన్ సారధ్యం వహించారని చెబుతారు. ఆ సమయంలో పంజాబ్‌లో వారం పాటు ఒక్క కిలో గోధుమలు అమ్మకుండా రైతులు సమ్మె చేసిన ఘటన దేశంలో సంచలనం రేపింది. దీంతో ప్రభుత్వం భేషరతుగా రైతుల పరిష్కారానికి అంగీకరిచాల్సి వచ్చిందని చెబుతారు. అప్పట్లో ఇది అప్రకటిత రైతు సమ్మెగా అక్కడివారు ఇప్పటికీ చెబుతుంటారు. 1990లో రాజ్యసభకు నామినెట్ అయ్యారు.
- అనిల్ ఘన్వత్…ఈయనా రైతు నాయకుడే. మహారాష్ట్రలోని అతి పెద్ద రైతు సంస్థ షెట్కరి సంఘటన్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1979 లోఈ సంస్థ ఏర్పాటైంది. కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రాలో జరిగిన రైతు ఉద్యమానికి సారధ్యం వహించారు. ముంబై-గుజరాత్ హైవేను దిగ్బంధం చేసిన ఉద్యమం అది. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని ఈయన పూర్తిగా వ్యతిరేకిండచం లేదు. కొన్ని మార్పులు అవసరమని చెబుతున్నారు.
- Must Read ;- గేరు మారుస్తున్న మేడం.. ప్రతిపక్షాల దన్నుతో కేంద్రంపై పోరాటం