సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. బన్నీ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంత చిత్రీకరణను జరుపుకుంది. ఎర్రచందనం అక్రమరవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ స్మగ్లింగ్ ముఠా సభ్యుడిగా బన్నీ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆ పాత్ర అసలు స్వరూపం .. ఉద్దేశం ఏమిటనేది తరువాత విషయం. చాలావరకూ దట్టమైన అడవుల్లోనే ఈ సినిమా షూటింగు జరగనుంది. అడవిప్రాంతాల్లో నివాసముండే గిరిజన యువతిగా ఈ సినిమాలో రష్మిక కనిపించనుంది.
‘సరిలేరు నీకెవ్వరు‘ సినిమాలోని ఓ పాటలో రష్మిక గిరిజన యువతిగా కనిపించి కుర్రాళ్ల మనసులను దోచుకుంది. ఆ లుక్ లో ఆమె మరింత అందంగా ఉందని చాలామంది చెప్పుకున్నారు. ఈ లుక్ లో ఆమెను చూసే సుకుమార్ ఆ రోల్ కి ఆమెను తీనుకున్నాడనే టాక్ కూడా వచ్చింది. క్రితం ఏడాది ‘భీష్మ‘ సినిమాతో హిట్ కొట్టేసిన రష్మిక, ఈ ఏడాది ‘పుష్ప’తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనే నమ్మకంతో ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన విలన్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
కథాపరంగా ఈ సినిమాలో విలన్ పాత్రకి విజయ్ సేతుపతి అయితే సరిగ్గా సెట్ అవుతాడనే ఉద్దేశంతో, సుకుమార్ ఆయనను తీసుకున్నాడు. అయితే అనుకోని అవాంతరాల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లింది. విజయ్ సేతుపతి తన డేట్స్ ను సర్దుబాటు చేయలేక తప్పుకున్నాడు. అప్పటి నుంచి ఫలానా హీరోని ఈ సినిమాలో విలన్ పాత్రకి తీసుకున్నారంటూ చాలాపేర్లు వినిపించాయి .. చివరిగా వినిపించిన పేరు ఆర్య. హమ్మయ్య ఇక్కడైనా ఈ ప్రచారం ఆగుతుందని అనుకుంటే, మళ్లీ ఇప్పుడు ‘శింబూ‘ పేరు తెరపైకి వచ్చింది. విలన్ గా ఆయన పేరును పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఈయనతోనైనా ఈ పుకారుకు ఫుల్ స్టాప్ పడుతుందా? లేదంటే పుకారిస్టులు ఈ ప్రచారానికి కామనే పెట్టేసి కామ్ గా తమ పని తాము చేసుకుపోతారా? అనేది చూడాలి.
Must Read ;- సుకుమార్ అంటే ఓ ప్రయోగం .. ఓ సాహసం