మన తెలుగు హీరోలు ఒక్కొరొక్కరుగా బయటికి వస్తున్నారండోయ్. ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈరోజు ఓ యాడ్ ఫిలిం షూటింగులో పాల్గొన్నారు. ఇప్పటిదాకా మన హీరోలంతా కరోనా భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. దాంతో ఆరు నెలలుగా షూటింగులు నిలిచిపోయాయి. ఈ కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారు. పెద్ద హీరోలు బయటికి రావడం లేదన్న విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. దాంతో పెద్ద హీరోలు షూటింగులు జరపాలని నిర్ణయించుకున్నట్లుగా ఉంది.
మొన్న నాగార్జున తన వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన కుమారుడు నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగులో పాల్గొన్నారు. ఇలా వరుసగా ఒక్కొరొక్కరుగా షూటింగుల మీద ఆసక్తి చూపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ప్రస్తుతానికి యాడ్ ఫిలిం చేసే పనిలో ఉన్నారు. ‘సర్కారువారి’ పాట సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడతారో చూడాలి. ఈ నెలలోనే మరికొందరు హీరోలు కూడా షూటింగులు ప్రారంభించే అవకాశం ఉంది. అక్కినేని మరో వారసుడు అఖిల్ తాజా సినిమా ప్రకటన కూడా ఈరోజు వచ్చేసింది.
ఈ సినిమాని కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా అక్కినేని కుటుంబం మాత్రం షూటింగుల విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. మెగా ఫ్యామిలిలీ మాత్రం సందడి మొదలు కాలేదు. థియేటర్ల ప్రారంభం విషయాన్ని పక్కన పెట్టి సినిమాలను పూర్తిచేసే పనుల్లో మాత్రం అందరూ బిజీగా ఉన్నారు. మరో వారం రోజుల్లో మరికొన్ని పెద్ద సినిమాల షూటింగులు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.