Ram Gopal Varma Tweets On Allu Arjun Trending In Social Media :
చిరంజీవి తర్వాత మెగాస్టార్ ఎవరన్నా ఉన్నరంటే.. అది అల్లు అర్జునే అని ట్వీట్ చేశారు. వర్మ ఇలా అల్లు అర్జున్ ని మెగాస్టార్ తో పోల్చడం హాట్ టాపిక్ అయ్యింది. వర్మ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్మ మెగా ఫ్యామిలీని, అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ.. గతంలో ట్వీట్స్ చేయడం.. ఆతర్వాత వర్మ కొన్నాళ్లు ట్విట్టర్ కు గుడ్ బై చెప్పడం తెలిసిందే.
మళ్లీ వర్మ ట్విట్టర్ లో సందడి చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేస్తూ.. ఇలా మెగాస్టార్ అనడం ఆసక్తిగా మారింది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు. పుష్ప రెండు పార్ట్ లుగా రాబోతుంది. ఇది అల్లు అర్జున్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. షూటింగ్ చివరి దశలో ఉంది. క్రిస్మస్ కానుకగా పుష్ప చిత్రం డిసెంబర్ లో పుష్ప ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప మూవీలోని సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే… ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అని పిలవాలి అంటూ సుకుమార్ బిరుదు ఇచ్చేశాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ అని బిరుదు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. మరి.. వర్మ కామెంట్స్ పై బన్నీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Must Read ;- గ్లోరీ బాటలో అషురెడ్డి.. ఆర్జీవీతో భలే ఛాన్సులే