సీఐడీ అరెస్టు చేసిన వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజును వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆక్కడ18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.వైద్య పరీక్షల అనంతరం రఘురామరాజును మరల గుంటూరులోని రమేష్ హాస్పటల్‌కు తరలించనున్నారు.ప్రభుత్వ వైద్యుల నుంచి, ప్రైవేటు వైద్యుల నుంచి రెండు రిపోర్టులనూ సీఐడీ కోర్టు అడగటంతో రఘురామరాజును ఇవాళ మరలా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
గుంటూరు చేరుకున్న బలగాలు
కేంద్ర ప్రభుత్వం ఎంపీ రఘురామరాజుకు కేటాయించిన వై కేటగిరీ భద్రతా సిబ్బంది ఇవాళ గుంటూరు చేరుకున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడకు చేరుకున్నాయి.కోర్టు ఆదేశాలతో కేంద్ర బలగాలు రఘురామరాజుకు రక్షణ కల్పించనున్నాయి.
Must Read ;- నా తండ్రిని పోలీసులు కొట్టారు.. కేంద్ర హోంశాఖకు RRR కుమారుడు భరత్ లేఖ