రఘురామరాజు స్పెషల్ మూవ్ పిటీషన్‌పై వాదనలు ముగిశాయి.డివిజన్ బెంచ్ న్యాయమూర్తులకు,ఎంపీ తరఫు న్యాయవాదులు రఘురామరాజు కాలి గాయాల ఫోటోలు చూపించారు.గాయాలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలుంటాయని హైకోర్టు హెచ్చరించింది.రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. రఘురామరాజుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. ముగ్గురు డాక్టర్లతో కూడిన వైద్య బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించి 2 గంటల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు స్పెషల్ డివిజన్ బెంచ్ ఆదేశించింది.మెడికల్ రిపోర్టు వచ్చిన తరువాతే తదుపరి ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది. వైద్య పరీక్షలు నిర్వహించేప్పుడు వీడియో కూడా రికార్డు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
Must Read ;- నా తండ్రిని పోలీసులు కొట్టారు.. కేంద్ర హోంశాఖకు RRR కుమారుడు భరత్ లేఖ