కరోనా.. పట్టణాలనే కాకుండా.. పల్లెలనూ వణికిస్తోంది. వందల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. మరణాల సంఖ్య కూడా ఎక్కువే అవుతోంది. గ్రామాల్లో అసలే ఇరుకు ఇరుకు గదులు. కరోనా వస్తే ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడ్డ ఓ యువకుడు డిఫరెంట్ ఆలోచించాడు. కరోనా వైరస్ ఇతరులకు సోకకుండా చెట్టు మీద ఐసోలేషన్ అయ్యాడు. అంతేకాదు.. తిండి, నిద్ర కూడా చెట్టుపై కానిచ్చేస్తున్నాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పదిరోజులు చెట్టుపై జీవిస్తున్నాడు. ‘చెట్టుపై ఐసోలేషన్’ అనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. యువకుడి ఐడియాకు చాలామంది ఫిదా అవుతున్నారు.
నల్లగొండ జిల్లా అడవి దేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన శివ అనే యువకుడు హైదరాబాద్ లో చదువుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా బిటెక్ చదువుతున్న శివ గ్రామానికి వచ్చి కూలీగా మారాడు. ఇంట్లోవాళ్లకు ఆసరగా నిలుస్తున్నాడు. రోజు కూలీ పనులకు వెళ్తుండటంతో కరోనా బారిన పడ్డాడు. తన నుంచి కరోనా వైరస్ కుటుంబ సభ్యులు, ఇతరులకు సోకకుండా చెట్టు మీద ఐసోలేట్ అయ్యాడు. నలుగురు కుటుంబ సభ్యులకు ఒకటే గది ఉండటంతో, ఇంటి ఆవరణలో చెట్టు మీద గడుపుతున్నాడు శివ.
Must Read ;- సింహాలపై కరోనా పంజా : హైదరాబాద్ జూ మూసివేత











