హీరో రాజశేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన, ఆయన భార్య జీవిత, పిల్లలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆయన పిల్లలు శివాని, శివాత్మిక కోలుకున్నారు. హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత మాత్రం ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ఏమిటంటే హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఆయన కూతురు శివాత్మిక ట్వీట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయ్యింది. తన తండ్రి త్వరగా కోలుకొని ఇంటికి తిరిగిరావాలని కోరుకుంటూ అభిమానులు ప్రార్థన చేయమంటూ ఆమె కోరింది.
‘కోవిడ్‌తో నాన్న పోరాటం చాలా కష్టంగా ఉంది. అయినా ఆయన కరోనాతో గట్టిగానే పోరాడుతున్నారు. మీ ఆదరాభిమానాలు మమ్మల్ని రక్షిస్తాయని మేం నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరంతా ప్రార్థించాల్సిందిగా వేడుకుంటున్నాను. నాన్న త్వరగానే కోలుకొని బయటకు వస్తాడు’అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఆమె చేసిన మొదటి ట్వీట్ లో పరిస్థితి సీరియస్ అని ఉంటే, రెండోసారి చేసిన ట్వీట్ లో అంత సీరియస్ లేదని పేర్కొంది.
I cannot thank you all enough for your love and wishes!
But please know, he is not critical.. he is stable and getting better!
We just need your prayers and positivity💖
Thank you once again💖
Do not panic
Please do not spread fake news💜— Shivathmika Rajashekar (@ShivathmikaR) October 22, 2020