విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు వైసీపీ ఎంపీలు ముందుకు రావాలని, ఈ క్రమంలో ముందుగా వారంతా తమ పదవులకు రాజీనామా చేయాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద జరిగిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాజీనామా చేయడానికి టీడీపీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని, వైసీపీ ఎంపీలతో కూడా ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
RINL ప్రారంభ దినోత్సవ రోజున, విశాఖ స్టీల్ ప్లాంటు కోసం పోరాడిన తెలుగు ప్రజలు, వారిచ్చిన భూములు, చిందించిన రక్తం, చేసిన త్యాగాలు, గుర్తు చేసుకోవాలి. వారి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రైవేటీకరణను నిరసిద్ధం. #VisakhaUkkuAndhrulaHakku నినాదం దేశమంతా మారోమోగాలి! #SaveVizagSteel pic.twitter.com/SW17JwrSnT
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) February 18, 2021
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. ఈ అంశంపై సీఎం జగన్ వెంటనే స్పందించి.. అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్ నుంచి డీలక్స్ సెంటర్ వరకు టీడీపీ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది.పీకి చెందిన వారికి మాత్రమే వర్తిస్తుందని తమ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Must Read ;- స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆన్ లైన్ పిటీషన్