ఇంటింటికీ రేషన్ అందించడానికి కోట్లు పోసి కొన్న వాహనాలు.. ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నాయి. నడిరోడ్డుపై మండుటెండలో సరుకుల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు తీసుకొచ్చాయి. తాజాగా ఇప్పుడేమో.. ప్రజలను ఊరి చివరనున్న పొలాల్లోకి రమ్మంటున్నాయి.
ఇక ఇంటి గుమ్మం వద్దకే సరుకులు వస్తాయని ఆశ పడ్డ లబ్ధిదారులు.. ఊరు చివరన ఉన్న పొలాల్లోకి వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటారా.. ఆ వాహనం ఊరి చివరనే ఆగుతుంది కనుక. అలా ఎందుకంటారా? అక్కడే సిగ్నల్ వస్తుంది కనుక. ఆ సిగ్నల్ ఉంటేనే వేలిముద్ర వేయడం సాధ్యపడుతుంది కనుక. సిగ్నల్ సమస్యతో సరుకుల పంపిణీ వాహనాన్ని ఊరి బయట పొలాలకు తీసుకెళ్లి, అక్కడ లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల సిగ్నల్ సమస్యలతో ఇదే దుస్థితి ఏర్పడింది. అనేక చోట్ల నెట్‌వర్క్ సమస్యతో రేషన్ బియ్యాన్ని సక్రమంగా పొందలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా శుక్రవారం ఇంటింటికీ వెళ్లే రేషన్ బియ్యం మినీ వాహనాన్ని గ్రామాలకు దూరంగా పొలాల వద్ద నిలబెడుతున్నారు. అదేమంటే.. అక్కడే సిగ్నల్ దొరుకుతోందని చెబుతున్నారు.
Must Read ;- రేషన్ పంపిణీ మళ్లీ డీలర్ల చేతికే..