పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈఏడాది జూలై 30న విడుదల కానుంది. కాగా ప్రభాస్ మరో రెండు సినిమాలకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ గా తెరకెక్కుతుండగా.. మరో సినిమా ‘ఆదిపురుష్’ .. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్నాడు. రామాయణం ఆధారంగా దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే వారమే సెట్స్ మీదకు వెళ్ళనుంది.
ఇక ప్రభాస్ ఇటీవలే లాంచ్ అయిన ‘సలార్’ చిత్రానికి సంబంధించిన 10రోజుల షెడ్యూల్ లో తన పోర్షన్ పూర్తి చేశాడు. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. బొగ్గుగనుల నేపథ్యంలో సాగే ఒక క్రైమ్ థ్రిల్లర్ గా సలార్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ డాన్ గా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ట్విట్టర్ వేదిక గా ప్రకటించారు. కేజీఎఫ్ తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఈ సినిమా ని కూడా అదే కేటగిరిలో తెరకెక్కిస్తున్నాడు. హోం బలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న సలార్ మూవీ ప్రభాస్ కు ఏరేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
𝐓𝐡𝐞 𝐌𝐨𝐬𝐭 𝐕𝐢𝐨𝐥𝐞𝐧𝐭 #𝐒𝐚𝐥𝐚𝐚𝐫 arriving in theatres worldwide on 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒, 𝟐𝟎𝟐𝟐 🔥#Salaar14Apr22
We can't wait to celebrate with you all 🔥#Prabhas @prashanth_neel @hombalefilms @VKiragandur @shrutihaasan @BasrurRavi @bhuvangowda84 pic.twitter.com/SMon9AyWM5
— Vijay Kiragandur (@VKiragandur) February 28, 2021