నాగార్జున యూనివర్శిటీ అధికారుల సమక్షంలోనే విద్యార్థులు రెచ్చిపోయారు. ఇన్‌ఛార్జి వీసీ రాజశేఖర్ సమక్షంలో గణతంత్ర వేడుకల సందర్భంగా రికార్డింగ్ డాన్సులు, జగనన్న పాటలకు స్టెప్పులు వేశారు. బావలు సయ్యా .. అంటూ విద్యార్ధులు రెచ్చిపోయారు. ఈ తంతు గమనించి ఆపాల్సిన యూనివర్శిటీ అధికారులు చోద్యం చూశారు. యూనివర్శిటీలో రికార్డింగ్ డాన్సులు నిర్వహించి గణతంత్ర వేడుకలను అభాసుపాలు చేయడంపై మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశభక్తితో జరుపుకోవాల్సిన విద్యార్ధులు ఇలా రికార్డింగ్ డాన్సులు చేయడం చర్చనీయాంశంగా మారింది. వేడుకలకు హాజరైన యూనివర్శిటీ అధ్యాపకులు, అతిథిలు వేదికపై జరుగుతున్న తంతు చూసి ఎవరికీ చెప్పలేక చిన్నగా జారుకున్నారు. నాగార్జున యూనివర్శిటీలో జరిగిన ఈ అరాచకాలపై మాట్లాడేందుకు వీసీ సుముఖత వ్యక్తం చేయడం లేదు.
Must Read ;- పట్టాల పంపిణీలో ‘జిగేలు రాణి’ డాన్సులు..!