ఏపీలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐజీ సంజయ్‌ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరుగుతాయని గతంలోనే నిమ్మగడ్డ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు ముక్కుసూటి అధికారిగా పేరున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌ను నియమిస్తున్నట్టు నిమ్మగడ్డ ప్రకటించారు. ఆ వెంటనే ఐజీ సంజయ్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలసి బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు చెప్పారు.
చకచకా ఏర్పాట్లు
స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు బలగాలను గ్రామీణ ప్రాంతాలకు తరలించారు. మొదటి దశ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఇప్పటికే పోలీసు బలగాలు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాయని హోంశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇక స్థానిక ఎన్నికల్లో శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి బాధ్యతలు చేపట్టడంతో ప్రశాంతంగా ఎన్నికలు జరిపేందుకు మార్గం సుగమమైంది.
Must Read ;- నిమ్మగడ్డ చెప్పినట్లే ఎన్నికలు జరుగుతాయి : సజ్జల