కరోనా జేమ్స్ బాండ్ ను సైతం దెబ్బతీసింది. ఎట్టకేలకు జేమ్స్ బాండ్ కోలుకున్నాడు. చావడానికి సమయం లేదంటూ జనం ముందుకు వచ్చేస్తున్నాడు. జేమ్స్ బాండ్ సిరీస్ లో 25వ సినిమా ఈ ‘నో టైమ్ టు డై’. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఒక్క యూఎస్ లో మాత్రమే అక్టోబరు 8న విడుదలవుతోంది. జేమ్స్ బాండ్ గా డేనియల్ క్రెగ్ కు ఇది చివరి సినిమా. మంగళవారం లండన్ లో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు.
దీనికి ఈ సినిమా నటీనటులతోపాటు బ్రిటీషు నటులు కూడా హాజరయ్యారు. డేనియల్ క్రెగ్ కు ఇప్పుడు 53 ఏళ్లు. అతను కూడా బ్రిటీషు నటుడే. ఇందులో నటించిన వారిందరికీ రెడ్ కార్పెట్ ఆహ్వానం లభించింది. ఇక జనాదరణే తరువాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువదించి ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. జేమ్స్ బాండ్ చిత్రాలకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇటీవల విడులైన ఈ సినిమా స్పెషల్ ట్రైలర్ కు కూడా మంచి ఆదరణ లభించింది.
కథలోకి వెళితే..
ఓ శాస్ర్తవేత్తను రక్షించే మిషన్ ను సీఐఏ మన జేమ్స్ బాండ్ కు అప్పగిస్తుంది. ఈ ప్రయత్నాన్ని విలన్ అడ్డకుంటాడు. భారీ ఛేజింగ్స్ ఉంటాయి. భయంకరమైన విలన్ గా ఆస్కార్ విజేత రామ్ మాలిక్ నటించాడు. గత ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావలసి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడింది. షూటింగ్ దశలో కూడా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. సెట్‌లో నటుడు డేనియల్ క్రేగ్ గాయపడడంతో షూటింగ్ కొంత కాలం ఆగిపోయింది.
మరోసారి సెట్‌లో అగ్నిప్రమాదం జరిగి పలు వస్తువులు కాలిపోయాయి. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకున్నా కరోనా వచ్చి విడుదలను అడ్డుకుంది. కేరళలో కూడా ఈ సినిమా విడుదలకాబోతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. జేమ్స్ బాండ్ గా డేనియల్ క్రెగ్ వీరోచిత విన్యాసాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.
Must Read ;- చావడానికి సమయం లేదంటున్న జేమ్స్ బాండ్











