చనిపోవడానికి సమయం లేదు.. సినిమా విడుదల కావడానికి కూడా సమయం రావడం లేదు. కరోనా కష్టాలు జేమ్స్ బాండ్ ను కూడా వదల్లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు మోక్షం లభించినట్టే ఉంది.
జేమ్స్ బాండ్ సిరీస్ లో 25వ సినిమా నో టైమ్ టు డై. ఈ సెప్టెంబరు 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. డేనియల్ క్రేగ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో విలన్ పాత్రను సఫీ రామి మాలెక్ పోషించారు. కారీ జోజి దీనికి దర్శకుడు. అమెరికాలో మాత్రం సెప్టెంబరు 8న విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఇది కూడా మైండ్ గేమ్ సినిమానే
సాధారణంగా జేమ్స్ బాండ్ సినిమాలన్నీ మైండ్ గేమ్ తోనే సాగుతాయి. ఎలాంటి గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే అద్భుతాలను ఈ జేమ్స్ బాండ్ సృష్టించాడు. ఎందుకోతెలియదుగానీ సీన్ కానరీ, రోగర్ మూర్ తర్వాత వచ్చిన జేమ్స్ బాండ్ లకు పెద్దగా ఆదరణ లభించలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. హాలీవుడ్ నటుడు డేనియల్ క్రేగ్ జేమ్స్ బాండ్ గా ఎన్ని విన్యాసాలు చేస్తాడో చూడాలి. ఇందులో కూడా అలాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలు ఉంటాయట.
భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. కథ విషయానికి వస్తే ఓ శాస్ర్తవేత్తను రక్షించే మిషన్ ను సీఐఏ మన జేమ్స్ బాండ్ కు అప్పగిస్తుంది. ఈ ప్రయత్నంలో అతన్ని విలన్ అడ్డకుంటాడు. ఎలాంటి ఛేజింగ్స్ ఉంటాయో ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. భయంకరమైన విలన్ గా ఆస్కార్ విజేత రామ్ మాలిక్ ఎలా చేశాడో చూడాలి. గత ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావలసి ఉంది. కరోనా వల్ల విడుదల ఆలస్యమైంది.
షూటింగ్ దశలో కూడా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. సెట్‌లో నటుడు డేనియల్ క్రేగ్ గాయపడడంతో షూటింగ్ కొంత కాలం ఆగిపోయింది. మరోసారి సెట్‌లో అగ్నిప్రమాదం జరిగి పలు వస్తువులు కాలిపోయాయి. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకున్నా కరోనా వచ్చి విడుదలను అడ్డుకుంది. ఆ తర్వాత కరోనా రెండో వేవ్. కేరళలో కేసులు బాగా పెరడగంతో ఆక్కడ థియేటర్లు మూతపడ్డాయి.
అయితే అక్కడ కూడా థియేటర్లను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే నో టైమ్ టు డై సినిమా కేరళలో కూడా విడుదలకాబోతోంది. కోవిడ్ గ్రాఫ్ ఎలా ఉందో ఈ నెల 15 కల్ల పరిశీలిస్తారు. అక్కడి సీఎం కూడా థియేటర్ల ప్రారంభానికి సుముఖంగా ఉన్నారు. ఓ పక్క మూడో వేవ్ భయం దేశమంతటినీ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే నో టైమ్ టు డై ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంతా సాఫీగా జరిగిపోయి ఈ నెలాఖరులకు సినిమా విడుదల అవుతుందనే మనం ఆశించాలి.
Must Read ;-అమితాబ్ బచ్చన్ ఫ్రీగా సినిమాల్లో నటిస్తారా?