( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, టిడిపి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కుటుంబాల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియ అధికారులు ప్రారంభించారు. తుంగ్లాం గ్రామంలో 12.5 ఎకరాలు, జగ్గరాజుపేట గ్రామంలో 5 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు ఆదివారం తెల్లవారుజాము 4 గంటలకే అధికారులు రంగంలోకి దిగారు. ఇందుకోసం భారీగా పోలీసులను మోహరించారు.
పళ్ళ సోదరుడి పేరిట…
పల్లా శ్రీనివాస్ సోదరుడు శంకర్రావు పేరిట ఈ భూములు ఆక్రమించినట్టు ఫిర్యాదులు అందాయి. నీలి మీడియాలో గత కొంత కాలంగా పల్లా శ్రీనివాసరావు ఆస్తుల పై అనేక కథనాలు వస్తున్నాయి. వాటి ఆధారంగా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పల్లా శ్రీనివాసరావు నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాన్ని గతంలో కూల్చివేశారు. వాటిపై కోర్టు వివాదం నడుస్తోంది. ఇంతలో అతని కుటుంబీకుల ఆధీనంలో ఉన్న ఆస్తులపైనా దాడులు ప్రారంభించారు. శంకర్రావుకు ముందుగా నోటీస్ ఇచ్చి స్వాధీన ప్రక్రియ చేపట్టినట్టు రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.
Must Read ;- విజయసాయిరెడ్డి ఆఫర్ ను తిరస్కరించినందుకే : అసలు విషయం ఇదేనన్న పల్లా











