జగన్ సర్కార్ మాత్రం అధికారికంగా పేరును ప్రకటించలేదు. పైగా అభ్యర్థిని నిర్ణయించడానికి సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ, చివరికి ఎటువంటి కచ్చిత మైన నిర్ణయం తీసుకోకుండానే సమీక్ష ముగిసింది. జరుగుతున్న ప్రచారం ప్రకారం జగన్, బల్లి దుర్గాప్రసాద్ భార్య లేదా కొడుకు పేరునే ప్రకటించబోతున్నారా?
అందరికీ తెలిసిందే
తిరిపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ కరోనా కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఇలా జరిగినపుడు సాధారణంగా పార్టీలు వారి భార్యనో, కొడుకునో అభ్యర్థిగా ఎంచుకోవడం మామూలు విషయమే. అందులో కొత్తేమీ లేదు. అదే ఫార్ములాను అధికారక పార్టీ కూడా ఫాలో అవబోతుందని సమాచారం. బల్లి దుర్గాప్రసాద్ కొడుక్కు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అతను తిరస్కరిస్తే దుర్గాప్రసాద్ భార్యకు టికెట్ ఇచ్చే సమాలోచన చేస్తున్నారు.
సమీక్ష నిర్వహించిన జగన్
తను ఏది చేయాలనుకుంటే అది చేయడం జగన్ కి మొదటి నుండి ఉన్న అలవాటు. ఏ సంప్రదింపులైనా అవి పేరుకు మాత్రమే. ఇది జగన్ ని గమనించే ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అందుకే జగన్ కి ఏదైనా కచ్చితంగా చెప్పడానికి కూడా జంకుతారు మంత్రులు. తాజాగా తిరుపతి అభ్యర్థి ఎన్నికపై తాడేపల్లి క్యాంపు కార్యలయంలో సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయలను వెల్లడించారు. సమీక్షకు హాజరైన మంత్రులు మీరు ఎవరిని నిర్ణయిస్తే మా మద్దతు వారికి అందిస్తామని తెలియజేసినట్లు సమాచారం. చివరికి ఎటువంటి నిర్ణయం లేకుండానే సమాలోచనలతో సమీక్ష ముగించారు.
జగన్ నిర్ణయం ఏమిటో?
జగన్ పాత ఫార్ములానే ఫాలో అవుతాడా లేక కొత్త ఒరవడికి శ్రీకారం చుడతాడా. అభ్యర్థి మరణించిన సానుభూతిని తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రతి పార్టీ ఆశిస్తుంది. అదే తరహాను పాటిస్తే, దుర్గా ప్రసాద్ ఇంటికే ఈ టికెట్ దక్కుతుంది. మరి జగన్ మదిలో ఏముందో?