సున్నపురాయి అక్రమమైనింగ్ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత యరపతినేనిపై సీబీఐ సోదాలు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ఒకేసారి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు, హైదరాబాద్‌లోని ప్రాంతాల్లో యరపతినేని కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే యరపతినేని నివాసాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ, పలు డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన 17 కేసులను సీఐడీ ఈ ఏడాది, సీబీఐకి బదిలీ చేసింది. అగష్టు 26వ తేదీన సీబీఐ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.
కేసు పూర్వాపరాలు ఏటంటే?
2014 నుంచి 2018 వరకు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అప్పటి గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ జరిపించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వం వచ్చాక సీఐడీ విచారణకు ఆదేశించింది. కొన్ని ఆధారాలు సేకరించి, తరవాత కేసును సీబీఐకి అప్పగించారు. తాజాగా సీబీఐ అధికారులు శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా అక్రమ మైనింగ్ గుట్టురట్టు చేశారని తెలుస్తోంది. ఈ కేసులో యరపతినేనికి చెందిన కార్యాలయాలు, నివాసాలపై సీబీఐ ఏకకాలంలో 25 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
Also Read: టీడీపీ కీలక నేతతో వైసీపీ ఎంపీ మిలాఖత్!











