RGV Old Pic Gone Viral In Social Media :
ఎక్కడ ఎక్కాలో కాదు ఎక్కడ తొక్కాలో వర్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. ఈ మధ్య సైకిలెక్కి పోజు కొడుతున్న తన చిన్నప్పటి ఫోటో ఒకదానిని వర్మ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆ పోజు చూస్తే ఎవరికైనా పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న మాటలో నిజమెంతో తెలిసిపోతుంది. ఆ ఫొటో చూసి నెటిజన్లు అయితే ఓ ఆట ఆడేసుకున్నారు. నెటిజన్ల విషయానికి తర్వాత వద్దాం.. ఆయన ఆస్థాన రచయిత సిరాశ్రీ పెట్టిన కామెంట్ కు మాత్రం వర్మ దండం పెట్టేశారు. ‘మీరు సైకిల్ మీద కూర్చుంటే అది పిక్ అయ్యింది.. అదే నాగార్జునతో సైకిల్ చైన్ లాగిస్తే ఎపిక్ అయ్యింది’ అంటూ కామెంట్ చేశారు.
ఆ మాటల గారడీకి వర్మ ఎమోజీతో దండం పెట్టారు. వర్మ చిన్నప్పుడు పంజాగుట్ట కాలనీలో దిగిన ఫొటో అట ఇది. ఇక ఆ ఫొటోకు నెటిజన్లు చేసిన కామెంట్లు అయితే పీక్ లో ఉన్నాయనుకోండి. ‘ఆ రోజు మొదలు పెట్టారు తొక్కడం.. ఇప్పటికీ అమ్మాయిలు అందర్నీ అలాగే తొక్కేస్తున్నారు కదా. మాలాంటి కుర్రవాళ్లకు ఛాన్స్ ఇవ్వలేదు మీరు. అమ్మాయిలంతా మీకే పడిపోతే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి?’ అంటూ ఒకరు కామెంట్ చేస్తే, ‘నువ్వు ఏది ఎక్కితే దాని విలువ అమాంతం పెరిగిపోతుంది’ అంటూ ఇంకొకరు కామెంట్లు పెట్టారు.
వర్మ తొక్కడం చిన్నప్పుడే ప్రారంభమైందంటూ వేసిన సెటైర్లకు లెక్కే లేదు. ఇలాంటి పిక్ లు వర్మ బయోపిక్ కు బాగానే ఉపయోగపడేట్టున్నాయి. ‘శివ’లో నాగార్జునతో సైకిల్ చైన్ లాగించారుగానీ బహుశా చిన్నప్పుడే ఇలాంటి చైనులు లాగిన ఘనత వర్మకు ఉండే ఉంటుంది. చిన్నప్పుడు తానెంత అమాయకంగా ఉన్నానో అంటూ వర్మ ప్రకటించుకున్నారుగానీ ఆ చూపుల్లోనే కనిపిస్తోంది దేశముదురుతనమంతా.
Must Read ;- ఆల్జీబ్రాలో కాదు ఇది అరియానా, ఆర్జీవీల ఎక్స్