సురేఖవాణి-సుప్రీత.. రిలేషన్ పరంగా వీళ్లిద్దరూ తల్లీకూతుళ్లు. కానీ బిహేవియర్ పరంగా చూసుకుంటే బెస్ట్
ఫ్రెండ్స్. అంతలా కలిసిపోతారు వీళ్లిద్దరూ. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఇద్దరూ వెళ్తారు. విహార యాత్రలు చేస్తారు. చివరికి ఓ పెగ్ పుచ్చుకునే విషయంలో కూడా ఇద్దరూ కలిసే ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త చర్చలు పెడుతుంటుంది సుప్రీత. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా అలాంటిదే ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. తన మందు కహానీ మొత్తం బయటపెట్టింది.
నా గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారా చెప్పండి అంటూ ఓ పోస్ట్ పెట్టింది సుప్రీత. దీనికి చాలామంది చాలా రకాలుగా స్పందించారు. కొందరు సుప్రీతను సాఫ్ట్ గా ప్రశ్నలు అడిగితే, మరికొందరు హద్దు దాటి ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది సుప్రీత. ఇందులో బాగంగా ఓ నెటిజన్.. మీరు సిప్ తాగాక ఒంటరిగా ఫీల్ అవుతారా అని ప్రశ్నించాడు. దీనిపై ఫన్నీగా రియాక్ట్ అయింది సుప్రీత
వైన్ బాటిల్ తాగిన తర్వాత ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అవుతానేమో అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో తనకు వైన్ తాగే అలవాటు ఉందనే విషయాన్ని సుప్రీత పరోక్షంగా బయటపెట్టినట్టయింది. నిజానికి చేతిలో వైన్ గ్లాస్ తో ఆమె గతంలో కొన్ని ఫొటోల్లో కనిపించింది. కాబట్టి ఆమెను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు ఇదేమంత ఆశ్చర్యం అనిపించలేదు.
ప్రస్తుతం మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తోంది సుప్రీత. ఆమె సినిమాల్లోకి వస్తుందంటూ చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. దీనిపై సురేఖవాణికి ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే ఈ అంశంపై సురేఖవాణి స్పందించడానికి నిరాకరించింది. తన కూతుర్ని స్వతంత్రంగా ఉండేలా పెంచానని, తనకు ఏదిష్టమో అదే చేస్తోందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తను చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తున్న సుప్రీత.. రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో అడుగుపెడతానంటే దానికి తను ఏమాత్రం అభ్యంతరం చెప్పనంటోంది. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనని తను మాత్రం సుప్రీతకు సలహా ఇవ్వనంటోంది.
టాలీవుడ్ లో ఓవైపు కెరీర్ స్టార్ట్ చేయకుండానే, మరోవైపు పెళ్లిపై కూడా స్పందించింది సుప్రీత. అతిగా ఆలోచించకుండా, ప్రశాంతంగా ఉండే వ్యక్తులు తనకు నచ్చుతారని.. అదే టైమ్ లో తన అల్లరి, పిచ్చిని భరించే వాడి ఉండాలని అంటోంది. ప్రస్తుతం తన మనసులో ఎవ్వరూ లేరని, కానీ రాబోయే 3-4 ఏళ్లలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెబుతోంది సుప్రీత.
Must Read ;- హీరోయిన్ వనిత నాలుగో పెళ్లి చేసుకోబోతోందా?











