బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణం తర్వాత కేసుల్లో ఇరుక్కున్న రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ ఎట్టకేలకు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఓ పక్క సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కేసు, మరో పక్క డ్రగ్స్ కేసు రియాను గుక్క తిప్పుకోకుండా చేసిన సంగతి తెలిసిందే. కటాకటాలు లెక్కించి ఎట్టకేలకు ఎలాగో బయటపడ్డారు. చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది వారికి. వారిద్దరూ ఓ జిమ్ బయట కనిపించే సరికి కెమెరాలు క్లిక్ మన్నాయి. రియా పింక్ కలర్ ఉన్న స్లీవ్ టాప్ ధరించింది.

బ్లాక్ టైట్ తో మాస్క్ పెట్టుకుని కనిపించింది. ఆమె సోదరుడు బ్లాక్ టీషర్టుతో కెమెరాకు చిక్కాడు. మొత్తానికి ఈ సోదర ద్వయం ఇలా రిమ్ జిమ్ అంటూ తిరిగేస్తున్నారు. ముంబైలోని బైకుల్లా జైలులో నెల రోజుల చేదు అనుభవాన్ని వీరు తమ జీవితంలో మరచిపోలేరేమో. కేదార్ నాథ్ అనే నటుడి ఖాతా నుంచి రియా రూ. 15 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో తగిన ఆధారాలతో వీరిని అరెస్టు చేసింది. ఎట్టకేలకు అక్టోబరు 7న బెయిల్ మీద విడుదలైంది. ఆమె సోదరుడు షోవిక్ కు మూడు నెలల తర్వాత ముంబయిలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Must Read ;- విధి చేతిలో ఓడిపోయిన విజయం (సుశాంత్ సింగ్ జయంతి ప్రత్యేకం)











