శాంతి.. అహింస.. ప్రపంచంలో ఎవరికైనా ఈ మాటలు వినగానే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి మన బోసి నవ్వుల బాపూజీ.. మహాత్మ గాంధీ. వారి మార్గనికి ఆకర్షితులైన నాయకులెందరో ఉన్నారు. అందులో ‘అంగ్ సాన్ సూకీ’ కూడా ఒకరు. ఈ పేరుతో కంటే ‘మయన్మార్ గాంధీ’గా ఈమె సుపరిచితురాలు. గాంధీ మార్గానికి ఆకర్షితురాలైనా సూకీ.. ఆయన మార్గమే తమ దేశానికి ప్రజాస్వామ్య దేశంగా మార్చగలదని గట్టిగా నమ్మింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఎన్ని విపత్తులు ఎదుర్కొవలసి వచ్చినా.. తన నమ్మకాన్ని ఇసుమంతైనా సడలనివ్వలేదు. అమె మొక్కవోని దీక్షే.. మయన్మార్‌ని ప్రజాస్వామ్య దేశంగా మార్చింది. సైనిక పాలనకు చరమగీతం పాడింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు తమ పాలకుల్ని ఎంచుకునే స్వేచ్ఛ ప్రాసాదించింది.
అసలెవరీ అంగ్ సన్ సూకీ?
1945, జూన్ 19న బర్మాలోని ఓ కుగ్రామంలో జన్మించినది సూకీ. ఆమె తండ్రి బర్మా స్వతంత్రం కోసం బర్మా సైన్య వ్యవస్థాపకుడు. అదే పోరాడంలో 1947లో మరణించారు. అంతే కాదు, ఆమె తల్లి సైతం రాజకీయల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అటు తండ్రి పోరాటపటిమ.. తల్లి రాజకీయ నీతి.. రెండింటినీ పుణికిపుచ్చుకుంది సూకీ. భారత్‌లోని, ఢిల్లోలో ఉన్నత చదువులు పూర్తి చేసిన సూకీ.. ఆ తర్వాత న్యూయర్క్‌లో జీవించసాగారు.
ఈ మాటలు వినగానే 1988లో బర్మాకు తిరిగొచ్చిన సూకీ.. అదే సమయంలో దీర్ఘకాలికంగా మయన్మార్‌ను పాలిస్తున్న సైనిక అధ్యక్షుడు పదివి నుండి తొలిగింపబడ్డాడు. ఆగస్టు 26,1988 లో ఆమె తన తొలి ప్రసంగంలోనే ప్రజలను ఆకర్షించారు. తన మొదటి మాటల్లోనే ప్రజాస్వామ్య దేశం కావాలని పిలుపునిచ్చారు. కానీ, తదుపరి నెల సెప్టెంబర్‌లో తిరిగి సైనిక అధ్యక్షుడు అధికారాలు చేపట్టాడు.
గృహ నిర్భంధం
సైనిక అధ్యక్షుడు అధికారాలు చేపట్టిన అదే నెలలో సూకీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ అనే పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 10 నెలలకే సైనికుల వెన్నులో వణుకు పుట్టించింది సూకీ. దాని ప్రభావమే తనను 1989 జులై 20న గృహ నిర్భంధంలో ఉంచారు. దేశాన్ని వదిలి వెళ్తానంటే.. విడిచి పెడతామని సైనికుల ప్రతిపాదనను, సూకీ తిరస్కరించారు. అమె పట్టుదల, శాంతి స్వభావాన్ని మెచ్చి.. ఎందరో మాజీ సైనికాధికారులు, రాజకీయనాయకులు.. తనకు అండగా నిలిచారు. అనతి కాలంలోనే తన నినాదం దేశంలోని యువతను కదిలించింది. వారు కూడా ప్రజాస్వామ్య దేశం కోసం నడుం బిగించారు.
ALSO Read ;- సైనికుల అదుపులో మయన్మార్ గాంధీ
నామమాత్రపు ఎన్నికలు..
1990లో ఎన్నికల నిర్వహణను ఒప్పుకున్నారు సైనికులు. బహుశా వారు ఊహించలేదు.. సూకీకి ఇంత బలం, బలగం వెంట ఉందని.. ఆ గర్వంతోనే ఎన్నికలకు సరే అన్నారు. కానీ సైనిక అంచనాలను తలకిందులు చేస్తూ.. దాదాపు పార్లమెంటులోని 80 శాతం సీట్లను అంగ్ సన్ స్థాపించిన ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ ఎగరేసుకుపోయింది. కానీ, సైనికులు అధికారాన్ని సూకీ చేతికివ్వడానికి ససేమీరా అనడంతో.. తిరిగి పాలన సైనికుల హస్తగతమైంది. తిరిగి సూకీని గృహ నిర్భందం చేశారు. 1991లో నోబెల్ ప్రైజ్ గెలిచినా కూడా దాన్ని అందుకోవడానికి దేశం విడిచి వెళ్లడానికి ఒప్పుకోలేదు సూకీ. ఆమె తరపున సూకీ కుమారులు, నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
15 సంవత్సారాల పాటు గృహనిర్భంధం
21 సంవత్సరాల రాజకీయ చరిత్రలో.. ఆమె 15 ఏళ్లు గృహ నిర్భంధంలోనే గడిచిపోయింది. కానీ ఆమె ప్రభావం దేశమంతా వ్యాపించింది. నిర్భంధం ఆమె శరీరానికి మాత్రమే.. తన ఆలోచనను, పట్టుదలను నిర్భందించే ఆయుధాలు ఉన్నాయా.. అందుకే ఆమె నోటి నుండి వెలువడిన శాంతి మంత్రం.. దేశ ప్రజలకు మార్గనిర్ధేశకంగా మారింది. ప్రజాస్వామ్య వాయువుల్ని పీల్చుకోవాలనే దేశ ప్రజల కోరికని ముందుండి నడిపింది. చివరికి ఆమె పట్టుదల నెగ్గింది. ఐదు దశాబ్దాల సైనిక పాలనకు చరమగీతం పాడింది. 2015లో జరిగిన ఎన్నికల్లో సూకీ ఘన విజయం సాధించి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆపై 2020 నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. ఇందులో కూడా ఆమెదే విజయం.
కానీ, తాజాగా మళ్లీ విజృంభించిన సైనిక మూకలు, సూకీని అదుపులోకి తీసుకుని విజయం సాధించామని గర్విస్తున్నారు. కానీ సూకీకి ఇలాంటివేమీ కొత్త కాదని వారు ఎరిగినట్లు లేరు. ఆడ రూపంలో గాంధీ తిరిగి తమ దేశానికి సైనిక సంకెళ్ల నుంచి విముక్తి అందిస్తుందేమో చూడాలి!
Must Read ;-దేశంలోనే పిన్నవయస్కురాలైన మేయర్ ‘ఆర్యా రాజేంద్రన్’