మంచు మనోజ్ .. తన అన్న విష్ణులాగానే.. కొంత కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ఒప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడు రెడీ చేసుకున్న స్ర్కిప్ట్ ‘అహం బ్రహ్మస్మి’. తన తల్లి పేరుతో యం.యం.ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి.. మొదటి ప్రాజెక్ట్ గా ఈ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త కుర్రోణ్ణి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా కరోనా కారణంగా లేటుగా నిర్మాణం జరుపుకుంటోంది.
తమిళ నటి, టీవీ యాక్ట్రెస్ ప్రియా భవానీ శంకర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అహంకారం వల్ల మనిషి ఏ విధంగా పతనమవుతాడో ఈ మూవీతో చెప్పబోతున్నారు. ఇక ఇందులో ఓ అతిథి పాత్రకు సాయిధరమ్ తేజను సంప్రదించాడట మనోజ్. మెరుపులాంటి ఓ పాత్రతో తేజు ఈ సినిమాలో ఒక సన్నివేశంలో కనిపిస్తాడట. కథను మలుపుతిప్పే పాత్ర అతడిదే అవుతుందని తెలుస్తోంది. మంచు వారి ఫ్యామిలీకి , మెగా ఫ్యామిలీకి మంచి రిలేషన్స్ ఉండడంతో .. మనోజ్ అడిగిన వెంటనే సాయి ధరమ్ తేజ అతిథి పాత్రే అయినా.. అందులో నటించడానికి అంగీకారం తెలిపాడట.
Also Read : భారీగా బరువు తగ్గిన మంచు వారసుడు!