సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ‘ఏమాయ చేశావే‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి చిత్రంతోనే నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సమంత. తర్వాత కాలంలో టాలీవుడ్, కోలీవుడ్ లో అనేక మంది స్టార్ హీరోలతో నటించి మంచి విజయాలు సాధించింది. తన మొదటి సినిమాలో హీరోగా నటించిన చైతన్య అక్కినేనితో ప్రేమలో పడ్డారు సమంత. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వారిద్దరూ ఒకటి అయ్యారు. ఈ అమ్మడు సినిమాలతో పాటు పలు యాడ్స్ మరియు కొన్ని షోలకు హోస్ట్ గా కూడా చేశారు.
ప్రస్తుతం ఆమె ‘సామ్ జామ్‘ అనే టాక్ షో కు హోస్ట్ గా చేస్తున్నారు. అలాగే సమంత సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈమధ్యనే సమంత ఇంస్టాగ్రామ్ లో 10మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటారు సమంత. తాజాగా తన మేకప్ రూమ్ లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సమంత. ఇందులో సమంత చాలా క్యూట్ గా కనపడుతున్నారు. తన గ్లామర్ స్టిల్స్ తో కుర్రకారులలో వేడి పుట్టిస్తోంది సమంత.
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ చూసిన సమంత అభిమానులు ఆమె అందంతో ప్రేమలో పడిపోతున్నారు. మల్టీ కలర్స్ దుస్తులలో ఆమె ఒక ఎంజల్ లా ఉందని అభిప్రాయ పడుతున్నారు. సమంత అభిమానులతో పాటు సామాన్య నెటిజన్లు కూడా ఫోటోలపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. సమంత పెళ్లి ముందు కన్నా వివాహం అయిన తర్వాతే మరింత అందంగా తయారైందని అంటున్నారు నెటిజన్లు. మొత్తం మీద తన ఫొటోలతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలుస్తోంది సమంత.
Also Read: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మెగాస్టార్ లేటెస్ట్ మేకోవర్