విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఎఫ్ 2’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ‘ఎఫ్ 3’ ప్లానింగ్ లో ఉందని తెలిసిన్పటి నుంచి ఈ సినిమా పై క్యూరియాసిటీ ఏర్పడింది. ‘ఎఫ్3’ సెట్స్ పైకి వెళ్లడానికి అంతా రెడీ అయ్యింది. వచ్చే వారం ‘ఎఫ్ 3’ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవల అనిల్ రావిపూడి సింహాచలం వెళ్లి ‘ఎఫ్ 3’ స్ర్కిప్ట్ కి ప్రత్యేక పూజలు చేయించిన విషయం తెలిసిందే.
Must Read ;- ‘ఎఫ్ 3’ లో మూడో ఎఫ్ అర్థం ఏంటో తెలుసా..?
ఇప్పుడు ‘ఎఫ్ 3’ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఇందులో 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారట. ఎవరా ఐదుగురు అంటే.. ‘ఎఫ్ 2’లో నటించిన తమన్నా, మెహ్రీన్ ‘ఎఫ్ 3’ లో కూడా నటిస్తున్నారు. అయితే. ఇందులో వెంకీకి ఇద్దరు హీరోయిన్లు, వరుణ్ కి ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. మరో విషయం ఏంటంటే.. స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఇందులో ఓ ప్రముఖ హీరోయిన్ కనిపిస్తుందట. ఈ లెక్కన మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో కనిపించనున్నారు. అంటే.. ‘ఎఫ్ 3’ లో గ్లామర్ కి కొదవే ఉండదు. గ్లామరే గ్లామరు.
అనిల్ రావిపూడి తన గత చిత్రలో నటించిన హీరోయిన్ కి మరో అవకాశం ఇవ్వడం అలవాటు. ‘పటాస్’ నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. ఈ లెక్కన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించిన రష్మికకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ‘ఎఫ్ 3’ మరింత క్రేజ్ ఏర్పడిందని చెప్పచ్చు. తమన్నా, మెహ్రీన్, రష్మిక.. ఇక మిగిలిన ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే వారంలో సెట్స్ పైకి వచ్చే ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ‘ఎఫ్ 2’ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే ‘ఎఫ్ 3’ కూడా సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.
Also Read ;- వెంకీతో చేయాలనే తన కల నిజమైందంటున్న బ్యూటీ