బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ను త్వరలో మనం నటుడిగా చూడబోతున్నాం. ఈ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కు నటన వైపు దృష్టి ఎందుకు మళ్లిందో గానీ ఈ ప్రాజెక్టు వివరాలు వచ్చేశాయి. లవ్ రంజన్ నిర్మించబోయే సినిమాలో బోనీ నటిస్తున్నారు. ఇందులో ఆయన హీరో రణ్ బీర్ కపూర్ తండ్రి పాత్రను పోషిస్తున్నారు. త్వరలోనే ఆయన ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం బోనీ కపూర్ నిర్మాతగా పలు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి.
నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాన్ హీరోగా రూపొందుతున్న ‘వకీల్ సాబ్’లో ఈయనకు కూడా నిర్మాణ భాగస్వామ్యం ఉంది. గతంలో నాగార్జున హీరోగా అంతం సినిమాని నిర్మించారు.ఇప్పుడు వకీల్ సాబ్ తోపాటు, బదాయి హో రీమేక్, మైదాన్, తమిళంలో వాలిమై చిత్రాలు నిర్మిస్తున్నారు. కుమార్తె జాన్వీ కపూర్, కుమారుడు అర్జున్ కపూర్ కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు. దర్శకుడు లవ్ రంజన్ తను దర్శకత్వం వహించే సినమాలో నటించమని కోరడంతో బోనీ అంగీకరించినట్టు తెలిసింది.
Must Read ;- టాటూలతో గ్లామర్ ఒలికిస్తోన్న ఖుషీ బేబ్











