మన దేశంలో వివిధ భాషల్లోని చిత్రాలు తెరకెక్కుతుంటాయి కానీ.. దైవ భాష అయిన సంస్కృతంలో చాలా తక్కువ సినిమాలు రూపొందాయి. ఈ నేపథ్యంలో సంస్కృతంలో రాబోతున్న మరో అరుదైన చిత్రం ‘నభాంసి’. అవార్డ్ విన్నింగ్ మేకర్ రామ్ అల్లాడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొంనుంది. ఈ మూవీని పూర్తిగా సంస్కృత భాషలోనే తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు అంటే.. మార్చ్ 8వ తేదీన నంభాసి సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది.
దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం మనదేశంలో జరిగిన కథ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. భార్యా భర్తల మధ్య జరిగే రొమాంటిక్ స్టోరీ ఇది. సంగీత, సాహిత్య, నృత్మాలకు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. 75 శాతం అమెరికాలోనూ, మిగిలిన 25 శాతం ఇండియాలోనూ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోబోతోంది. 2022 లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాకి భరద్వాజ్ వి కొమరగిరి సంగీతం అందిస్తుండగా, సరితా నవాలి సంభాషణలు సమకూర్చుతున్నారు.
Must Read ;- ‘ప్లే బ్యాక్’ లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో వర్కౌట్ అవుతాయి











