తమిళ హీరో సూర్య నటించిన తమిళ చిత్రం ‘సూరారై పోట్రు’. ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దు రా’ అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో హీరో సూర్య, హీరోయిన్ అపర్ణ బాలమురళిల నటన, సుధా కొంగర దర్శకత్వ ప్రతిభను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి అరుదైన గౌరవం లభించింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రతిష్టాత్మకమైన గోల్డన్ గ్లోబ్ అవార్డ్ కు ఈ సినిమా ఎంపికైంది. వచ్చే సంవత్సరం జనవరిలో లాస్ ఏంజిల్స్ లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. 2డి ఎంటర్ టైన్మెంట్ రాజ్ సేకర్ పాండియన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేశారు. గోల్డన్ గ్లోబ్స్ లో విదేశీ చిత్రాల కేటగిరిలో ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్ధాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో ఈ సినిమాని డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు.
అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజైంది. అయితే.. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ సినిమా కూడా అలాంటి ఫలితాన్నే చూడాల్సి వస్తుంది అనుకున్నారు కానీ.. ఈ సినిమా అంచనాలను తారుమారు చేసింది. తమిళ్ లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసి ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమాకు విశేషాదరణ లభించడంతో ఆతర్వాత మరి కొన్ని తమిళ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.
Must Read ;- గ్లామర్ టాప్ లేపిన బోల్డ్ బ్యూటీ పాయల్