బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసిపోయింది. ఒకవిధంగా ఇది షాకింగ్ ట్విస్టే. అందరూ జస్వంత్ ఎలిమినేట్ కావచ్చని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో సరయు పేరు తెరపైకి వచ్చింది. అసలు సరయును ఈ షోకి తీసుకున్నప్పుడే విమర్శలు వచ్చాయి. షోకి మంచి మసాలా కావాలనే ఉద్దేశంతోనే సరయును తీసుకున్నారన్నారు. షోకి ఇది ప్లస్ అవుతుందనుకున్నారు. సరయును ఎలిమినేట్ చేయకుండా కొనసాగినట్లయితే మంచి మసాలా దొరికి ఉండేది. ఈసారి షో కూడా చప్ప చప్పగానే కొనసాగుతోంది.
టీఆర్పీలో కూడా వెనకబడి పోయి ఉంది. షో మీద హైప్ క్రియేట్ చేయడం కోసమే సరయు ఎలిమినేషన్ జరిగిందా? ఆమె యాటిట్యూడ్ కారణమైందా? అన్నది తెలియదుగానీ హౌస్ నుంచి మాత్రం ఆమెను బయటికి పంపాలన్న నిర్ణయం మాత్రం జరిగిపోయిందని సమాచారం. ఈరోజు సాయంత్రం అధికారికంగా విషయం బయటికి వస్తుంది. జెస్సీ ఎలిమినేషన్ వైపే అన్ని పోల్స్ మొగ్గుచూపాయి. ఎలిమినేషన్ నామినేషన్స్ లలో ఉన్న ఆరుగురిలో యాంకర్ రవి, హమీదాలు శనివారం ఎపిసోడ్స్ తో సేవ్ అయ్యారు.
ఇక మిగిలింది నలుగురు. వారిలో మానస్, సరయు, కాజల్, జెస్సీ. ఈ నలుగురిలో జెస్సీ ఎలిమినేట్ కావచ్చన్నది అంచనాలు. వీరిలో మొదట మానస్, కాజల్ లను సేవ్ చేసి ఆ తర్వాత జెస్సీ, సరయు.. ఇద్దరిలో ఎవరన్నది ఉత్కంఠ రేపుతారు. చివరికి సరయును ఎలిమినేట్ చేసినట్టు తెలిసింది. ఈ షోలో ఇది ఊహించని షాక్. ఇది కేవలం వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. జెస్సీపై కొంత సానుభూతి కూడా వచ్చింది. సరయు ఎలిమినేషన్ తో ఇక మసాలా కోరుకునేవారికి ఆ స్థాయి బూతులు దొరక్కపోవచ్చు. ఇక ఆమె కథ ఇక సెవెన్ ఆర్ట్స్ ఛానెల్ కు చేరినట్టే.











