తమ వాస్తవికతను ప్రపంచానికి ప్రకటించే వారు చాలా అరదుగా ఉంటారు. నిజానికి చాలా మంది తమ వాస్తవికతను ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. తమ లోపాల్ని కప్పిపుచ్చి ప్రపంచం ముందు గొప్పగా ఉండడానికే ఇష్టపడతారు. కానీ, తాను ట్రాన్స్ జెండర్‌ని అని ప్రకటన విడుదల చేసి అందరికీ షాకిచ్చింది హాలివుడ్ పాపులర్ నటి ఎలియట్ పేజ్. ఇలాంటి బహిరంగా ప్రకటించాలంటే చాలా ధైర్యం కావాలి. తన ప్రకటన మద్దతుగా నెటిజన్లు ‘సూపర్ హీరో’ అంటూ తనని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఈ విషయం చెప్పడానికి ఆనందిస్తున్నా
జునో సినిమాలో తన నటనకుగాను ఆస్కార్ అవార్డు పోటీల్లో నిలిచిన నటి ఎలియట్ పేజ్. ‘ద అంబ్రెల్లా అకాడమీ’ వెబ్ సీరిస్ తో మరింతగా ప్రేక్షకులకు దగ్గరైనా అందాల తార అందరికీ మైండ్ బ్లాక్ అయేంత నిజాన్ని చెప్పింది. ఏమైందో తెలియదు కానీ, హఠాత్తుగా తన ట్విట్టర్ ద్వారా తను పోస్ట్ చేసిన లెటర్ ని చదివి అందరూ ఇది నిజమా కాదా అనే డైలమాలో పడిపోయారు. తాను ట్రాన్స్ జెండర్ అని, దీన్ని ఇలా బహిరంగగా ప్రకటించే అవకాశం ఇన్నాళ్లకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది ఈ హాలీవుడ్ తార.
— Elliot Page (@TheElliotPage) December 1, 2020
షాకింగ్ న్యూస్
హాయ్ ఫ్రెండ్స్… నేను ఈ రోజు మీకొక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని మీరు నమ్మలేకపోవచ్చు. కానీ ఇది నిజం. నేనొక ట్రాన్స్ జెండర్ ని. ఈ విషయం మీకందరికి ఇప్పటికైనా ప్రకటించే అవకాశం వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. అంతేకాదు, ఈ లెటర్ రాయగలుగుతున్నందుకు చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు.
నాకు మీరే స్ఫూర్తి
నాలా నేను బతకడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. ట్రాన్స్ జెండర్ల సంఘం నుంచి నాకెంతో మద్దతు లభించింది. మీ ధైర్యానికి, ఉదార స్వభావానికి నా అభినందనలు. మీకు ఈ సమాజంలో సమాన గుర్తింపు లభించడానికి నా వంతు ప్రయత్నం, మద్దతు, అలుపులేని పోరాటం చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. కానీ, మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే. కాస్త సహనం వహించండి. ఈ విషయాన్ని ధైర్యంగా, ఆనందంగా బయటపెడ్తున్నా కూడా, దీని తర్వాతి పరిణామాల గురించి నా మనసు కలవరపడుతుంది.
ఈ విషయం బహిర్గతమైన తర్వాత అందరి నుండి ఎదురయ్యే ఎగతాళి, ఛీత్కారాలు తలుచుకుంటే నాకు భయమేస్తుంది. కానీ, నా సంతోషాన్ని ఆ భయాలతో ఆవిరికానివ్వను. ఈ క్షణాన్ని నేను సంతోషంగా గడుపుతాను. కానీ, సమాజంలో ట్రాన్స్ జెండర్లు ఎదుర్కోంటున్న హింస, అవమానాలు తులుచుకంటేనే బాధగా ఉంది. 2020 సంవత్సరంలో దాదాపు 40 ట్రాన్స్ జెండర్లు వివక్ష కారణంగా చంపబడ్డట్టు రిపోర్లు చెప్తున్నాయి. అంతేకాదు, సమాజానికి వెరసి, అవమానాలు తట్టుకోలేక దాదాపు 40 శాతం యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చాలు. ఇవన్నీ భరించడానికి మేము సిద్ధంగా లేము. మీ దాడులను భరిస్తూ నోరెత్తకుండా ఉండేదాన్ని కాదు నేను. వీటిని ధైర్యంగా ఎదిరించి నిలుస్తాను.
నేను గర్విస్తున్నా
నేను ట్రాన్స్ జెండర్ అయినందుకు గర్విస్తున్నా. ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడుతున్నా. హింస, అవమానాలు, దాడులు ఎదుర్కోంటున్న ట్రాన్స్ జెండర్లలందరికీ ఇదే నా మాట. నేను మీ కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మనమందరం కలిసి మనల్ని గౌరవించేలా ఎదగాలి. మన కోసం ఓ మంచి సమాజాన్ని నిర్మించుకోవాలి. ఇలాంటి మాటలకు, దాడులకు వెరవకండి. అవన్నీ కేవలం తాత్కాలికమే. మనం జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఇలాంటి వాళ్ల ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి.
నువ్వు సూపర్ హీరో ‘ఎలియట్’
తన లెటర్ ని చదివిన ప్రతి ఒక్కరు తనకు మద్దతుగా పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టారు. నువ్వు ‘సూపర్ హీరో’ అంటూ మెచ్చుకుంటున్నారు. మన లోపాల్ని మనమే అంగీకరించలేకపోతే, సమాజం అంగీకరించలా మనం ఎలా చేయగలం. ట్రాన్స్ జెండర్ అయినా సమాజంలో అందరితో సమానంగా బతికే హక్కు వాళ్లకి ఉంది. దానిని కాదనడానికి సమాజానికి ఎటువంటి హక్కు లేదు. వారిని అవమానించడం, హింసించడం నేరాలు. ఇలా పలురకాలుగా కామెంట్స్ పెడుతూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు నెటిజన్లు.