నిధులు దారి మరలించారు..
పంచవర్ష ప్రణాళిక నిధులు ఏమయ్యాయి? నరేగా నిధులు ఎక్కడిపోయాయి? స్పెషల్ గ్రాంట్ ఎలా మాయమయ్యాయి? అని సర్పంచ్ నిలదీస్తుంటే.. ప్రభుత్వం నుంచి సమాధానం రావడంలేదు. గత్యంతరం లేక సర్పంచ్ లో రోడ్డెక్కారు. నిరసనలు వ్యక్తం చేశారు. బొచ్చపట్టుకుని భిక్షాటన చేసి, ఆందోళనకు దిగారు. అయినా జగన్ రెడ్డి ప్రభుత్వం కనికరించలేదు. పంచాయతీ నిధులను దారిమళ్లించి, గ్రామ పాలనపై దెబ్బకొట్టారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఇక నమ్మకాలు పెట్టుకోవడం అనవసరమని భావించి, ఆయన సొంత జిల్లా కడప, ఖాజీపేట మండలంలో అధికార వైసీపీకి చెందిన 13 మంది సర్పంచ్ లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అయినా జగన్ రెడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. అటూ ప్రజలకు, ఇటూ పార్టీకి చెప్పుకోలేక.. రెండిటికి చెడ్డ రేవడి మాదిరిగా ఏపీలో సర్పంచ్ లు కాలాన్ని నెట్టకొస్తున్నారు.
ఇక సహించం.. మా నిధులు మాకు జమచేయడం!
పంచాయతీలో పాలన ప్రారంభ ఏడాది దాటినా.. నేటికి చిల్లిగవ్వ కూడా ప్రభుత్వం నుంచి పంచాయతీ ఖాతాలకు వచ్చి చేరలేదు. కేంద్రం నుంచి వచ్చే వచ్చే నిధులను సైతం దారి మళ్లిస్తున్నారని సర్పంచ్ లు మండిపడుతున్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని సర్పంచ్ ల సంఘం ప్రతినిధులు ముట్టడించారు. గ్రామ పంచాయతీకుల రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సర్పంచ్ తరలివచ్చి.. ఏపీ పంచాయతీ రాజ్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ ను గదిలో పెట్టి నిర్బంధించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సర్పంచ్ లకు నచ్చజెప్పి బయటకు తీసుకెళ్లారు. పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ. 7 వేల కోట్ల నిధులను దారి మళ్లించారని సర్పంచ్ ల ప్రతినిధులు మండిపడ్డారు. సర్పంచ్ లకు చెప్పకుండా వారి ఖాతాల నుంచి నిధులు ఎలా మళ్లిస్తారంటూ.. ధర్నాకు దిగారు. కమిషనర్ వచ్చే వరకు తన ధర్నా అపేదేలేదని భీష్మించడంతో అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు!
Must Read:-ఏపీలో ఉగ్రవాదులకు మించిన పాలన సాగుతోంది! చంద్రబాబు