ఖాకీపై అధికారపార్టీ కండకావరం!
ఏపీలో ప్రభుత్వాధికారులు, ఖాకీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖాకీల పరిస్థితి అయితే మరి ఘోరం. పగవాడికి కూడా పట్టకూడదు వారి పట్టిన గతి అని ప్రత్యక్షంగా ప్రజలు విమర్శిస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పోలీసుల విధులు కత్తిమీద సాములా మారింది. పోలీసులు లేకుండా అడుగు బయటపెట్టలేని అధికారపార్టీ నేతలు, వారికి కోపం వస్తే.. పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టడం, దాడులకు తెగపడటం మరి దారుణం. ఆ మొన్న విశాఖలో మంత్రి సీదిరి అప్పలరాజు సీఐ ను నోటికొచ్చినట్లు తిడితే.. పోలీసు అధికారుల సంఘాల నుంచి ప్రతిస్పందన అంతంత మాత్రంగా ఉంది. నిన్న విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పై ఎంపీ నందిగం సురేష్, ఆయన అనుచరులు పడి దాడి చేసి, కానిస్టేబుల్ పై కొడితే.. పోలీసు అధికారుల సంఘాల నుంచి నో రెస్పాన్స్! నేడు కృష్ణ జిల్లా ఉయ్యూరు ఘటనలో రూరల్ ఎస్ఐ రమేష్ ను పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి నోటికొచ్చినట్లు తిట్టి.. మా కార్యకర్తలను రెచ్చగొడితే.. మీ పరిస్థితి ఎంటో అర్థచేసుకోండి అని వార్నింగ్ కూడా ఇవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు.
ఉద్యోగాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించే వారిపై దాడులా?
పోలీసులు తమ ఉద్యోగాలను సైతం పణంగాపెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. పబ్లిక్, విపక్షాలపై అధికార వైసీపీ నేతలు దాడులు చేసినా, రక్తలు వచ్చేట్లు కొట్టినా.. కేసులు కట్టకూడాదు. వారిని పలెత్తుమాట అనుకూడాదు. తన్నులు తిన్నవారిపైనే కేసులు కట్టి, చట్టాలకు వ్యతిరేకంగా బాధితులను ఇంకా బాధించాలన్నది వైసీపీ పథకం. ఆ పథకాన్ని పోలీసులు అమలు పర్చకుంటే.. వారిపై దాడులు, దౌర్జన్యాలు, వ్యక్తిగత దూషణలకు దిగడం వంటివి సర్వసాధారణం. ఎక్కడైనా బాధితులకు అనుకూలంగా, వైసీపీ నేతలకు ప్రతికూలంగా వ్యవహిస్తే చాలు.. ఎమ్మెల్యేలు ఎంటరై.. పోలీసులు నోటికొచ్చినట్లు తిట్టడం, లేకుంటే దాడిచేయడం, ఆ తరువాత ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల కృష్ణాజిల్లా, ఉయ్యూరులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపరిచారు. ఈ వివాదంలో నమోదు అయిన కేసులో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు చేయి చేసుకున్నారని అభియోగం. దీంతో ఎమ్మెల్యే పార్థసారధికి కార్యకర్తలు ఫిర్యాదు చేయగా.. పార్థసారధికి కోసం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోవడమే కాకుండా.. నోటికొచ్చినట్లు ఎస్ఐ రమేష్ తిట్టి, మా వాళ్లును రెచ్చగొడితే .. ఏం జరిగిద్దొ తెలుసుగా అని నేరుగా వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే పార్థసారధి తీరు పట్లు ప్రజలు మండిపడుతున్నారు. అధికారం చేతిలో ఉందని పోలీసులను అంత హీనంగా చూడటం మంచి పద్దతి కాదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి!
Must Read:-టీడీపీ నేతలపై మొత్తం 60 కేసులు!











