గ్రామ స్థాయి నుంచే తెదేపా పోరాటం!
సర్పంచ్ ల వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు వైసీపీ ప్రభుత్వం పూనుకుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను పెంచిపోషిస్తూ గ్రామీణ పాలనకు స్వస్తి పలకాలని చూస్తున్నారని, దానిని తిప్పకొట్టేలా పోరాటాలు చేయాలని తెలుగుదేశం పార్టీ సర్పంచ్ లకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. గురువారం మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో తెదేపాకు చెందిన రాయలసీమ ప్రాంత జిల్లాల సర్పంచ్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పంచాయతీలకు చెందిన ఆర్థిక సంఘం, ఉపాధి హామీ నిధులను చట్టవిరుద్దంగా దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిధులను తిరిగొచ్చేవరకు న్యాయపోరాటం చేయాలని తెదేపా సర్పంచ్లకు ఆయన సూచించారు.
రాజ్యంగ హక్కులను హరిస్తున్నారు
గ్రామ పంచాయతీ పాలన, విధులు గురించి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ లకు చంద్రబాబు వివరించారు. సర్పంచ్లకు రాజ్యాంగం అధికారాలను ఇచ్చిందని, రాజ్యాంగ హక్కులను హరించేందుకు జగన్ చూస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో జగన్ రెడ్డి పార్టీ పన్నిన అకృత్యాలకు ధీటుగా ఎదరొడ్డి తెదేపా సర్పంచ్ బరిలో నిలిచారని, గెలిచి ప్రజస్వామ్యాన్ని నిలపెట్టారని గుర్తు చేశారు. గ్రామాభివృద్ధి రోజురోజుకు కుంటుపడుతోందని, ఇది మంచి పరిణామం కాదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి చంద్రబాబు హెచ్చరించారు. సర్పంచ్ లకు ఉన్న పరిజ్ఞానం కూడా సీఎం కు లేదని ఆయన ఎద్దేవా చేశారు!
Must Read:-ముందుస్తుకు పోతే ముప్పు వైసీపీకే! తనగొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్!!